CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేగా చరిత్రను తెలిపే పాటల సి డి ఆవిష్కరణ.ఆసక్తి కలిగిస్తున్న సిద్దెల పాట- ప్రజల నోట

Share it:

 



మన్యం మనుగడ, డెస్క్: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన రేగా కాంతారావు గతంలో చేసిన, భవిష్యత్తులో చేయబోవు కార్యాచరణ గురించి పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ నిర్మాతగా వ్యవహరించి, జానపద కళాకారుడు సిద్దెల హుస్సేన్ రచించి, పాడిన రేగా చరిత్రను తెలిపే పాటల సిడి ఆవిష్కరణ జరిగింది. పాట ఆద్యంతం రేగా కాంతారావు పినపాక నియోజకవర్గానికి, చేసిన సేవలు, రేగా విష్ణు ట్రస్టు ద్వారా ప్రజానీకానికి అందించిన ఆర్థిక సహాయాలు, కంటి వెలుగు కార్యక్రమం ద్వారా

 నియోజకవర్గ ప్రజానీకానికి అందించిన వెలుగులు, ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న విధానం, గురించి పాడిన పాట పలువురి నోట అలరారుతుంది. ఈ పాటల సి.డి ని జిల్లా అధ్యక్షుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతం వినోబా నగర్ రాగానే, రాజకీయ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తల మధ్య ఉత్సాహభరితంగా రేగా కాంతారావు చేత ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, జానపద కళాకారుడు సిద్దెల హుస్సేన్, రేగా కాంతారావు వ్యక్తిగత సలహాదారు చందా హరికృష్ణ, ఎంపీటీసీ చింతపంటి సత్యం, ఆదివాసీ సాంస్కృతిక డివిజన్ అధ్యక్షులు పోలె బోయిన అనిల్ కుమార్, ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షులు తోలెం శ్రీనివాస్, మన్యం మనుగడ రీజినల్ మేనేజర్ దామోదర్ గౌడ్, మణుగూరు రిపోర్టర్ మహేష్, పినపాక రిపోర్టర్ శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: