CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు భూముల పరిరక్షణ యాత్ర ను జయప్రదం చేయండి.

Share it:

 


గుండాల ఫిబ్రవరి 8 (మన్యం మనుగడ) పోడు భూముల పరిరక్షణ కై చేపట్టిన బస్సు యాత్ర ను జయప్రదం చేయాలని పోడు భూముల పరిరక్షణ కమిటీ కన్వీనర్ గుండాల సర్పంచ్ సీతారాములు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల పదో తారీఖున మండల కేంద్రానికి పోడు భూముల పరిరక్షణ బస్సుయాత్ర చేరుకుంటుందని రైతులు ఈ యాత్రలో అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామంటే ఫారెస్ట్ అధికారులు వాటిని తీసుకొని హరితహారం పేరుతో మొక్కలు నాటడం ఎంతవరకు సమంజసమన్నారు. పోడు రైతుల కోసం చేసే యాత్ర ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీపీ సత్యం, పునేం శ్రీను, పీ వై ఎల్ నాయకులు రవి, కొడెం వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు రమేష్, న్యూ డెమోక్రసీ నాయకులు శంకరన్న, శాంతయ్య , బీఎస్పీ నాయకులు రాంబాబు, టీజేఎస్ నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: