CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శభాష్ శీనన్న.మరువలేని సాయం చేస్తున్న ఆదివాసి ఐక్య వేదిక అధ్యక్షుడు.

Share it:

 





  • ఎందరి నడకకో చేయూత
  • ఆర్థికంగా లేని వారి ఆపద్బాంధవుడు


మన్యం మనుగడ, పినపాక:


 అతడొక ఒక సామాజిక కార్యకర్త. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదివాసి విద్యార్థులకు విద్యను అందించే బాల వెలుగు పాఠశాల ఉపాధ్యాయుడు. ఆయనే పినపాక మండలం సింగిరెడ్డి పల్లి పంచాయతీ దేవనగరం గ్రామానికి చెందిన తోలెం.శ్రీనివాస్. దీనితోపాటు సామాజిక సేవా సంస్థలను సంప్రదించి ఆర్థికంగా లేక అనారోగ్యంతో బాధపడుతున్న వికలాంగులకు తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు వివిధ కారణాల చేత కాళ్లు కోల్పోవడం జరిగింది. వికలాంగులుగా మిగిలిన వారిని నేనున్నానంటూ విజయవాడలోని రోబోటిక్ రిహాబిలిటేషన్ సెంటర్ ను సంప్రదించి, రూపాయి ఖర్చు లేకుండా లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అయ్యే కృత్రిమ కాలును, సుదీక్ష ఫౌండేషన్ నిర్వాహకురాలు విమల తో మాట్లాడి అమర్చడం జరిగింది. ఇటీవల అమరారం పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన బిజ్జా రమేష్ వాహన ప్రమాదం లో తన ఎడమకాలును కోల్పోయి, అంగవైకల్యంతో బాధపడుతున్న సమయంలో, విషయాన్ని విజయవాడలోని సామాజిక సేవా సంస్థ వారికి తెలియజేయగా, రెండు రోజుల క్రితమే అతనికి కాలును అమర్చడం జరిగింది.

ఈ సందర్భంగా బిజ్జా రమేష్ మాట్లాడుతూ, అంగవైకల్యంతో బాధపడుతున్న నాకు, ఆపద్బాంధవుడు గా నిలిచి, కృత్రిమ కాలు అమర్చడానికి సాయం చేశారని, జన్మజన్మలకు తోలెం శ్రీనివాస్ చేసిన సాయాన్ని మరువలేనని , ఎప్పటికీ రుణపడి ఉంటాను అని తెలియజేశారు. శ్రీనివాస్ చేసిన ఈ సహాయాన్ని మండల ప్రజలు శభాష్ అని అంటున్నారు.

Share it:

TS

Post A Comment: