CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు భూముల పై మాట తప్పిన ప్రభుత్వం - 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పరిష్కరించాలి.పోడు రైతుల నుండి ప్రభుత్వం స్వీకరించిన పోడు దరఖాస్తులను తక్షణం పరిశీలన ప్రారంభించాలి.

Share it:

 


  • పోడు భూముల సమస్యను పరిష్కరించే దాకా పోడు భూముల్లో కందకాలు తవ్వడం,స్త్రంచర్ కొట్టడం ఆపాలి
  • పోడు సాగు దారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి
  • కొత్త పోడు కొట్టేది లేదు పాత పోడు వదులు కునేది లేదు
  • కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

మన్యం మనుగడ ములుగు.

ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన పోడు భూముల పోరాట కమిటీ సమావేశం 

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ 

 ప్రిబ్రవరి 9,10 తేదీలలో మేడారం నుండి ఇల్లందు వరకు బస్సు యాత్ర ఉంటుంది.ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు తో పాటు సీపీఎం సీపీఐ నాయకులు వీభద్రం,చాడా వెంకటరెడ్డి,కోదండరామ్, సాధినేని వెంకటేశ్వరరావు ,పోటు రంగారావు, ప్రసాద్ లతో పాటు గిరిజన ,ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొంటారు కావున ములుగు ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలి అని 

రాష్ట్ర ప్రభుత్వ స్పందనను బట్టి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని పోడు రైతు పోరాట కమిటీ నిర్ణయించింది. పోడు రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గత ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించిన ఫలితంగా పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో వాగ్దానం చేశారు. గత ఏడాది నవంబర్ నుండి డిసెంబర్ వరకు పోడు భూముల సాగుదారుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల అటవీ ఎకరాలకు గాను 1 లక్షా 10 వేల దరఖాస్తులను స్వీకరించింది. కానీ స్వీకరించిన దరఖాస్తులను పరిశీలన చేయకుండా పోడు సాగు దారుల భూముల్లో అటవీ సరిహద్దుల పేరుతో యంత్రాలతో కందకాలు తవ్వడం కొట్టడం పెద్ద ఎత్తున ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమైన చర్య దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం పోడు భూముల సమస్యను పరిష్కరించకుండా శాటిలైట్ మ్యాపుల పేరుతో పోడు భూములను అడవుల్లో కలిపేసుకునే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అన్యాయమని ఎదురుతిరిగిన గిరిజనులు ,పేదలపై అటవీశాఖ ,పోలీసులు దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ తీవ్ర నిర్బంధాన్ని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి పోడు సాగు దారుల నుండి స్వీకరించిన దరఖాస్తులను తక్షణం పరిశీలన ప్రారంభించాలని, హక్కు పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే గతంకంటే తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు,టి జే ఎస్ పార్టీ, గిరిజన, ప్రజాసంఘాల తో ఏర్పడిన పోడు రైతు పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్

సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి,బైరెడ్డి సాంభా శివ రెడ్డి

ఎండీ అంజ ద్ పాషా,ఫిషర్ మేన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్ష పతి

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చెన్నోజూ సూర్యనారాయణ,రత్నం రాజేందర్

ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి సుమన్ రెడ్డి

తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: