CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సౌది మూనీర్ వేధింపులు.కన్నీటి పర్యంతం ఐనా ముస్లిం మహిళా.నాకు రావలసిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్న సౌదీ మునీర్ ఆలం - సౌదీ నుండి వాట్సప్, గ్రూపుతో బ్లాక్మెయిలింగ్ దందా....

Share it:

 




    


  • ఒకే సామాజిక వర్గానికి చెందిన ఖమ్మం ప్రజలను టార్గెట్ చేస్తున్న వైనం -
  • క్యాన్సర్ భారిన పడి మృతి చెందిన షరీఫా తల్లి ఆవేదన..
  • --తన కుటుంబాన్ని పెండ్లి కాని కూతుర్ని బద్నాం చేస్తున్నాడని, కన్నీటి పర్యంతం
  • విలేఖర్ల సమావేశంలో ఖమ్మంకు చెందిన బాధితురాలు

మన్యం మనుగడ, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి:

గతంలో 2020వ సంవత్సరంలో మా కుటుంబానికి సహకరించిన సామాజిక కార్యకర్త ను బద్నాం చేసే కుట్ర చేసాడని, 

విరాళాల రూపంలో వచ్చిన తనకు రావలసిన డబ్బులు 35 వేల రూపాయలు కూడా ఇవ్వకుండా, మోసం చేసి, మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఫొటోను మరియు వీడియోలను ప్రస్తుతం తదితర వాట్సప్ గ్రూపులలో వైరల్ చేస్తూ మా పరువును మంటగల్పుతున్నాడని, ఖమ్మంకు చెందిన బాధితురాలు వాపోయింది. 

ఈ రోజు సోమవారం ఖమ్మంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మూడు సంవత్సరాల క్రితం చనిపోయిన షరీఫా తల్లి పాల్గొని మాట్లాడారు. తమ కుటుంబానికి సహకరించిన ఒక సామాజిక కార్యకర్తను బద్నాం చేసేందుకు నా ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో వాడుకుంటూ తన స్వలాభం కోసం యత్నిస్తూ, సౌదీలో వుంటూ, ఇక్కడి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. నాకు రావలసిన డబ్బులు ఇవ్వకుండా సేవా మార్గంలో పని చేస్తున్న వ్యక్తులపై కుట్ర పన్నటం సరైంది కాదని అన్నారు. ఇదే విషయంలో 2020లో కూడా తమకు సహకరించే వ్యక్తులపై మునీర్ ఆలం విమర్శలు చేస్తే, ఆనాడు కూడా తాను ఖండిoచానని, కొన్ని పత్రికలలో కూడా రావటం జరిగిందన్నారు. మా కుటుంబాన్ని, మమ్ములను బద్నాం చేస్తున్న మునీర్ ఆలం పై పోలీస్ వారిని సంప్రదిస్తానని పేర్కొన్నారు. సౌదీలో కారు డ్రైవర్గా పని చేస్తున్న మునీర్ ఆలం ప్రెస్ క్లబ్ గ్రూపులలో నా ఫొటోలు, వీడియోలు వేయడం సమంజసం కాదన్నారు. సౌదీలో కారు డ్రైవర్గా పని చేస్తున్న మునీర్ ఆలం పై ఖమ్మంలోని 1ప పట్టణ పోలీస్ స్టేషన్ మరియు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదులు వున్నాయని, ముఖ్యంగా మునీర్ ఆలం అనే వ్యక్తి ముస్లిం మైనార్టీ వాట్సప్ గ్రూపులలో గాని, మరే ఇతర వాట్సప్ గ్రూపులలో విమర్శనాస్త్రాలు, వ్యక్తిగత విమర్శలు, పరువుకు సంబంధించిన అంశాలను అతను వేస్తే, ఆ వాట్సప్ గ్రూపు అడ్మిన్లలు కూడా ఖండించాలని కోరినారు. 

ఇక నుంచి సేవా మార్గంలో పని చేస్తున్నవారిని కాని, మమ్ములను కాని, సోషల్ మీడియాలలో పెట్టి అభాసుపాలు చేయవద్దని, హెచ్చరించారు.

Share it:

TS

Post A Comment: