CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు భూముల్లోట్రాంచి లు తీయుటకు వెళ్తున్న జెసిపి లను అడ్డుకున్న ప్రజలు.

Share it:

 


మన్యం మనుగడ, గుండాల/ఆళ్ళపల్లి:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ముత్త పురం,తూరుబాక,నడిమిగూడెం, పెద్దతోగు గ్రామాల్లో ఆదివాసీలు ఇతర పేదలు సాగుచేసుకుంటున్న పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులుట్రాంచిలు కొట్టడం కొరకు (జెసిపి) యంత్రాల తో బయలుదేరగా ముత్త పురం గ్రామం వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి అడ్డుకోవడం జరిగింది.

      ఈ సందర్భంగా సిపిఐ (ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల సర్పంచ్ కొమరం సీతారాములు ప్రసంగిస్తూ గత 30, 40 సంవత్సరాల నుండి పోడు భూములను నమ్ముకొని జీవిస్తున్న ప్రజలను పోడు భూముల నుండి వెళ్ళగొట్టి బహుళజాతి, కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్రలో భాగంగానే ఈ పోడు భూములను టిఆర్ఎస్ ప్రభుత్వంస్వాధీనం చేసుకుంటుందని విమర్శించారు.

ప్రజల జీవనాధారమైన పోడు భూములకు కెసిఆర్ ప్రభుత్వం ఒకపక్క దరఖాస్తు చేసుకోండి పట్టాలు ఇస్తామని చెప్తూనే మరొక ప్రక్క ఫారెస్ట్ అధికారులను ఉసిగొల్పి పోడు భూములలో కందకాలు తీసే ఆలోచన విరమించుకోవాలని కోరారు.

      ఫారెస్ట్ అధికారులు పోడు భూములలోకి వస్తే అడ్డుకోండి అని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫారెస్ట్ అధికారులు పోడు భూముల్లో ట్రాంచి తీస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

        ఇప్పటికైనా ఈ పోడు భూములు లాక్కునే ప్రయత్నాలు విరమించుకోక పోతే ప్రజల నుండి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

      ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ గుండాల సబ్ డివిజన్ కార్యదర్శి నరేష్, పర్శక రవి, భానోత్ లాలు, కొమరం హనుమంత్ రావు, కొమరం సత్యనారాయణ, పూనెం నరసయ్య, ఏట్టి రాంబాబు, తాటి రమేష్, ముక్తి ముత్తయ్య, ముత్త పురం, నడిగూడెం, పెద్ద తోగు, తూరుబాక గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: