మన్యంటీవి, అశ్వారావుపేట:పది సవంత్సరాల ప్రస్థానం, సమాజ మార్పు కోసం శాంతియుతంగా వేలాది అడుగులు, నిజాయితీని గుర్తించే వినూత్న కార్యక్రమాలు, గొప్పగా బతకడానికి డబ్బు సంపాదించ లేకపోవచ్చు కానీ లక్షలాది కోట్లాది మంది మనసులో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించింది. మనం చేసే పని నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు, నమ్మని ఆశయం కోసం సిద్ధాంతం కోసం సాగిన ప్రయాణం అలుపెరగకుండా నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఒకరిలో మొదలైన ఆలోచనే ఎన్నో మార్పులకు పునాదిగా మారుతోంది, బలమైన ఆశయంతో మనం ముందడుగు వేసినప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకు నడిచే వారు చాలా తక్కువ మంది ఉంటారు. మన సమాజంలో ఎన్నో రకాల సంస్థలు ఉంటాయి. ఎవరి ఆలోచన పరంగా వారు మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ సమాజంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న అవినీతిని ప్రశ్నించాలి అంటే మాత్రం అది కత్తి మీద సాము లాంటిదే, గత పది సంవత్సరాలుగా అలసట లేకుండా అవినీతి నిర్మూలన కోసం సమాజంలో మార్పు కోసం ప్రతినిత్యం వినూత్న కార్యక్రమాలతో ముందుకు పోతూ సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాదించుకున్న సంస్థ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ. సమాజంలో మార్పు కోసం శాంతి యుతంగా పనిచేస్తూ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ముందుడుగు వేయడం అభినందనీయమని అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బంధం ఉపేంద్ర రావు పేర్కొ న్నారు. శుక్రవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో యూత్ ఫర్ యాంటీ కరప్సన్ సభ్యులు సమక్షంలో యాక్ క్యాలెండర్ను ఆవిష్కరించి అనంతరం మాట్లాడుతూ రోజు రోజుకి అవినీతి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదనీ, యాక్ సభ్యులు ఓపికతో నిరంతరం పోరాడితేనే తప్ప సమాజంలో మార్పు తీసుకు రాలేమనీ, ప్రజల నుండి, ఎలక్షన్ నుంచే రాజకీయ నాయకుల నుండే మార్పు అనేది రావాలి మంచి నాయకుడిని ప్రజలు ఎన్నుకోవాలని మరియు ప్రజల్లో చైతన్యం రావాలని అన్నారు. అవినీతి నిర్మూలనపై ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచి, నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలన్నారు. ఈ సంస్థ మంచి ఆలోచనతో ముందుకు పోతుందని, అవి నీతిని ప్రశ్నించడమే కాకుండా , నిజాయితీని గుర్తిస్తూ ముందుకు పోవాలన్నారు. విన్నూత ఆలోచనాత్మక కార్యక్రమాలు చేస్తూ సమా జంలో మంచి మార్పుకోసం నిరంతరం ప్రయత్నం చేయడం మంచి పరిణామమన్నారు. అవినీతి జరిగిన చోట యువత ప్రశ్నించాలని, ప్రశ్నించినప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సభ్యులు ప్రవీణ్ కుమార్, దాది చంటి, రావుల ముత్యాలు రావు, వెల్కమ్ అంజి బాబు పాల్గొన్నారు.
Post A Comment: