CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోరాటం వీడి జన జీవన స్రవంతిలో కలవండి... సీఐ అశోక్ కుమార్.

Share it:

 *



 మన్యం టీవీ చర్ల:


తెలంగాణలో మావోయిస్టు పార్టీకి ప్రజాధరణ లేక , సొంతంగా నిలదొక్కుకోలేకపోతుంది . దీంతో తెలంగాణ మావోయిస్టు పార్టీ ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో తలదాచుకుంటూ అక్కడి అమాయక ఆదివాసీలను వారికి రక్షణ ఉపయోగించుకుంటుంది . భద్రాద్రి కొత్తగూడెం - తూర్పుగోదావరి డివిజన్ మావోయిస్టు కమిటీ పేరుతో కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ మరియు అతని అనుచరులు చత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా బీజాపూర్ జిల్లా ప్రాంతాల్లోని ఆదివాసి గ్రామాలను , అటవీ ప్రాంతాలను ఆధారంగా చేసుకొని తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రం , చర్ల ప్రాంతంలోని అమాయక ఆదివాసి ప్రజలను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు పార్టీ మీటింగులకు , చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు రావాలని బెదిరిస్తూ , అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు . భార్య సుజాత గత మూడు సంవత్సరాల క్రితం అరెస్టు కాబడి జైల్లో ఉండగా ఆమెకు బెయిల్ పేరుతో మరియు పార్టీ ఫండ్ పేరుతో కాకర్ల రవి , రాజేష్ లాంటి అనుచరులతో ఆజాద్ కాంట్రాక్టర్లు , వ్యాపారస్తులు , రైతుల దగ్గర నుండి బలవంతంగా డబ్బులు వసూళ్ళకు పాల్పడుతున్నారు . వీరి బాధితుల సంఖ్య చర్ల మండలంలో వందకు పైగా ఉంటారు . మావోయిస్టు పార్టీ పై నాయకత్వానికి తెలియకుండా తమ అనుచరుల ద్వారా ద్వారా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు . తన భార్య అరెస్ట్ అయిన తర్వాత తమ పార్టీ ఇతర నాయకుల సహకారం లభించక ఆజాద్ మనోవేదనతో కుంగిపోయి , జిల్లా పోలీసు అధికారుల మీద , జరుగుతున్న సంఘటనల మీద పరస్పర విరుద్ధ విషయాలతో , అవాస్తవాలతో వాట్సాప్ గ్రూపులలో ప్రెస్ నోట్ లు ఇస్తూ తన స్వంత వ్యక్తిగత ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు . ప్రస్తుతం తెలంగాణ - చత్తీస్గఢ్ సరిహద్దు ఆదివాసి గ్రామాల ప్రజలను మిలిషియాలో , గ్రామ కమిటీల లో పని చేయాలని , మావోయిస్టు పార్టీ సభలు , సమావేశాలకు హాజరు కావాలని మావోయిస్టు పార్టీ సభ్యులు బలవంతం చేస్తున్నట్లు గ్రామస్తుల నుండి స్పష్టమైన సమాచారం ఉన్నది . ప్రజలను ఎవ్వరూ బెదిరించిన , బలవంతపు చర్యలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటాము . భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ కమిటీ ఆజాద్ మరియు ఇతర మావోయిస్టు సభ్యులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి లొంగిపోయి , జనజీవన స్రవంతిలో కలవాలని , లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించడమే కాకుండా , పునరావాసం కొరకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని చర్ల సీఐ అశోక్ కుమార్ మన్యం మనుగడ ప్రతినిధికి తెలియజేయడం జరిగింది.

Share it:

TS

Post A Comment: