CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జే.డీ ఫౌండేషన్ కి సావిత్రిబాయి పూలే విశిష్ట సేవా పురస్కారం.

Share it:

.



సేవే పరమావధిగా నిత్యం సమాజ శ్రేయస్సు కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జేడీ ఫౌండేషన్ ని సావిత్రి బాయి పూలే సేవా పురస్కారం వరించింది. నూతన సంవత్సర రోజున ఈ పురస్కారం లభించడం మరో విశేషం.తెలంగాణ సారస్వత పరిషత్, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్ లో వి.ఎన్.ఆర్. చారిట్రబుల్ ట్రస్ట్ (హైదరాబాద్ - విజయవాడ) 12వ వార్షికోత్సవం సందర్భంగా నిస్వార్థంగా సేవ చేస్తున్న 21 మందిలో జేడీ ఫౌండేషన్ భద్రాచలం, చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి, ముఖ్య అతిదులు,శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి(తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి) శ్రీ జే.డి లక్ష్మి నారాయణ గారు (మాజీ సి.బి.ఐ.జాయింట్ డైరెక్టర్), డా. కోయి కోటేశ్వర్ రావు గారు (ప్రముఖ సాహితి వేత్త), శ్రీమతి టి. సువర్ణ కుమారి గారు (గచ్చిబౌలి ఎస్.పి), డా. నవీన్ వల్లం(V.N.Rచారిట్రబుల్ ట్రస్ట్ ) ఛైర్మెన్ గారి చేతుల మీదుగా శాలువా కప్పి సావిత్రిబాయి పూలే విశిష్ట సేవా పురస్కారం - 2022 ను జేడీ ఫౌండేషన్ భద్రాచలం భాద్యుడు శ్రీ మురళీమోహన్ కుమార్ తో పాటు సభ్యులందరికి అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ భాద్యుడు మాట్లాడుతూ, ఈ పురస్కారం జేడీ ఫౌండేషన్ భాద్యత మరింత పెంచిందని, రాబోయే రోజుల్లో మరింతగా సేవలు విస్తరణ ఉంటుందని చెప్పారు. ఈ పురస్కారం ని జేడీ ఫౌండేషన్ కి నిరంతరం సహకారాన్ని అందిస్తున్న ఫౌండేషన్ సభ్యులకు అంకిత మిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి హన్సి, శ్రీ వేమూరి పవన్, శ్రీ కడాలి నాగరాజు, శ్రీ యూసుఫ్ మియా, శ్రీ విశాల్, శ్రీ రామాంజనేయులు, ఎక్స్ట్రా మైల్ శ్రీ నాగ మోహన్ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: