CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

యువతకు క్రికెట్ కిట్ల పంపిణీ:సాఫ్ట్ వేర్ ఉద్యోగి కొమరం కృష్ణకాంత్.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, ముత్యాల నగర్ పంచాయతీకి చెందిన కొమరం కృష్ణకాంత్ వృత్తి రీత్యా అమెరికాలో సాఫ్ట్ వేర్ గా స్థిరపడ్డారు.కొన్ని రోజుల క్రితం గ్రామానికి చేరుకున్న కృష్ణకాంత్, ముత్యాలమ్మ నగర్,సంతోష్ నగర్ కు చెందిన స్థానిక యువతకు సహాయాన్ని అందజేశారు.ఈ మేరకు మూడు క్రికెట్ టీంలకు క్రికెట్ కిట్లు,బ్యాట్లు ఇతర వస్తు సామగ్రి తన స్వగృహంలో అందజేశారు.స్థానిక యువత క్రీడారంగంలో అద్భుతంగా రాణించాలని,భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని ఆయన కోరారు.ఆదివాసి గ్రామ యువతకు నిరుద్యోగులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించి,వారి ఉన్నత చదువు లకు,పోటీపరీక్షలకు,శిక్షణ కల్పించి కావలసిన మెటీరియల్ అందజేయాలని, తద్వారా ఆదివాసి గ్రామాల్లో ఉపాధి మార్గాలు కల్పించవచ్చు అన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి కొమరం కృష్ణకాంత్ తండ్రి,కొమరం లక్ష్మణ్ రావు,బయ్యారం విస్తరణ అధికారిగా పనిచేస్తున్నారు.ఈ కార్యక్రమం లో స్థానిక యువత బాలకృష్ణ, కొమరం కళ్యాణ్,సాయి,వంశీ, మడకం కృష్ణ,పవన్,ప్రభాస్, కార్తీక్ ఇతరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: