మన్యం టీవీ కరకగూడెం:క్రీడలు ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ధారుడ్యానికి కలిగి మండలానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.
కరకగూడెం మండల క్రికెట్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
అనంతరం కరకగూడెం మండల క్రికెట్ జెర్సీలు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చేతుల మీదగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ రేగా కాళిక,పినపాక ఎంపీటీసీ సత్యం,జానంపేట సర్పంచ్ బాడిశ మహేష్,తెరాస మండల యువజన విభాగం అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,కరకగూడెం మండల క్రికెట్ కెప్టెన్ కల్తి నరేష్,సభ్యులు వినోద్,కృష్ణమూర్తి,శివ,రవి,రంజిత్,నరేందర్
తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: