CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అకాల వర్షానికి ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు.నీట మునిగిన అపరాలు పంటలు. ..

Share it:


  • రైతన్నలకు పండుగ పూట నష్టాన్ని నింపింది అకాల వర్షం. 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

సంక్రాంతి పండుగకు సంతోషంగా ఇంటిలో గడపాల్సిన రైతులను పొలాలు,చేనులు,తోటల వద్దకు పరుగులు తీసే విధంగా చేసింది.ప్రకృతి వైపరిత్యానికి గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఏటూరునాగారం మండలంలో అపరాలు,మిర్చి పంటల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. రైతులను కష్టాల పాలు చేసింది.మండలంలోని కొండాయి,మల్యాల గ్రామాల్లోని రైతులు సాగు చేసిన మినుము, పెసర,బొబ్బెర,జనుముల పంట నీటి పాలయ్యింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జంపన్నవాగు ఉప్పొంగడంతో నీరంతా పంటల్లోకి చేరి నీట మునగడంతో పూత పిందెలు రాలిపోయాయి.అలాగే మిర్చి తోటల్లోని మొక్కలు వర్షానికి నేలకొరిగాయి.కల్లాల్లో ఆరబోసిన మిర్చి వర్షానికి కొట్టుకపోవడంతోపాటు తడిసి ముద్దయ్యిందని,అపరాల పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని రైతులు అట్టం నాగరాజు,దబ్బగట్ల గోవర్ధన్, బాబు,మహుబూసేన్, సల్మాన్,చిదురాల శ్రీనివాస్‌లు తెలిపారు.అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను అగ్రికల్చర్‌ అధికారులు పరిశీలించి నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలని రైతులు అధికారులను కోరుతున్నారు. అలాగే మాదరి శ్రీను,అక్బర్, శేఖర్,శంకరయ్య,రమేష్, నర్సింహులు,ఖదీరలకు చెందిన పంటలు కూడా దెబ్బతిన్నాయి.

Share it:

TS

Post A Comment: