CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న ఎక్షలెంట్ స్కూల్ విద్యార్థి.

Share it:

 


మన్యం మనుగడ పినపాక.

మాకు మేమే సాటి మాకు లేరు ఎవరు పోటీ అంటూ అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న ఎక్షలెంట్ విద్యార్థులు సాదిస్తున్న విజయాలను చూసి నివ్వెర పోతున్న తల్లి తండ్రులు.

ఇటీవల జరిగిన జాతీయ స్థాయి నుంచి నేటి అంతర్జాతీయ స్థాయి వరకు ఉన్న ఊరికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యా బుద్దులు నేర్పించిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఘడించి పెట్టిన చిచ్చారాపిడుగు.వివరాల్లోకి వెళ్తే.... మారుమూల ఏజెన్సీ ప్రాంతం లోని దమ్మక్కపేట గ్రామం మణుగూరు మండలానికి చెందిన బొమ్మకంటీ హర్ష వర్ధన్ స్థానిక ఎక్స్లెంట్ బాషా హై స్కూల్ భయ్యారం లో విద్యాబ్యాసం చేస్తున్నాడు. అటు చదువులోనూ, ఇటు క్రీడల్లో నూ రాణించాడు .పాఠశాల లో ప్రతిరోజు జరిగే ఆటల పీరియడ్ లో ఓనమాలు నేర్చుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో సైతం రాణిస్తు పలువురు చేత చెహాభాష్ అనిపించుకుంటున్నాడు.ఇటీవల జరిగినటువంటి అంతర్జాతీయ స్థాయిలో భారత్ నేపాల్ మధ్య జరిగిన ఖేల్ కబడ్డీ ఫైనల్ మ్యాచ్లో ఎక్స్లెంట్ భాషా హైస్కూల్ విద్యార్థి 3 టాకిల్ పాయింట్స్,4 రైడ్ పాయింట్స్ సంపాదించి జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.. భారత్ నేపాల్ మధ్య జరిగిన కబడ్డీ లీగ్ లో జట్టు విజయం లో కీలక పాత్ర వహించిన హర్షవర్ధన్ ను ఎక్స్లెంట్ భాషా హైస్కూల్ కరస్పాండెంట్ యూసఫ్ షరీఫ్ అభినందించారు ఇలాగే ప్రతి మ్యాచ్ లోనూ జట్టు విజయానికి కృషి చేయాలని మంచి పేరు ప్రతిష్టలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు ఘడించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లో ఎక్స్లెంట్ భాషా హై స్కూల్ డైరెక్టర్స్ ఎండి ఖాదర్, యాకూబ్ షరీఫ్ ముక్కు వెంకట నర్సారెడ్డి బండారు నరేంద్ర మరియు ప్రిన్సిపాల్ సురేష్ ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: