CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తిరుమల కుంట రైతు వేదికలో రైతుబంధు సంబరాలు.దేశానికే వెన్నెముక అయిన రైతుల కష్టాలను తీర్చిన ఘనత మన కెసిఆర్ దే... ఎంపీపీ

Share it:


  • రైతుబంధు ఘనత తెలంగాణ రాష్ట్రానిదే...మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జూపల్లి రమేష్


మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామంలో శనివారం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుబంధు సంబరాల కార్యక్రమంలో అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి మరియు మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జూపల్లి రమేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులు సేంద్రియ ఎరువులతో పండించిన ముగ్గురు రైతులకు దార ప్రసాద్, చిన్నం శెట్టి వెంకట నరసయ్య, నంద రైతులను శాలువాలు కప్పి సత్కరించారు. రైతుబంధు పథకం ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాలలో నగదు జమ అయిన సందర్బంగా నిర్వహిస్తున్న రైతుబంధు వారోత్సవాల సంబరాలలో భాగంగా వ్యవసాయం దాని ప్రాముఖ్యత - రైతుబంధు పథకం ఆవశ్యకతను రైతులకు తెలియచేయండి జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జూపల్లి రమేష్ లు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా ఎన్ని అవాంతరాలు వచ్చినా నిరంతరాయంగా కొనసాగిస్తున్న అద్భుతమైన పథకం రైతు బంధు అని అన్నారు. రైతుబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానిదేనని చెప్పారు. రైతుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న శ్రద్ధ అనిర్వచనీయమైనదని కొనియాడారు. ఆరుగాలం కష్టించి శ్రమించే రైతన్నకు అండదండగా ఉండాలనే గొప్ప ఉద్దేశంతో రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కరోనాతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధికారులు, ప్రజాప్రతినిధుల వేతనాలను సైతం నిలుపుదల చేసి రైతుబంధు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించి ప్రత్యామ్నాయ పంటలను చేపట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారు అన్నారు. 2018 నుండి ఇప్పటి వరకు రైతుల బ్యాంక్ ఖాథాలలో జమ చేసినా వివరాలు ఎంపీపీ తెలియజేశారు. అశ్వరావుపేట మండలం రైతు బంధు వివరాలు 2018 లో 8063 మంది రైతులకు 258963660రూ,, 2019 లో 8622 మంది రైతులకు 229604253 రూ,, 2020 లో 10436 మంది రైతులకు 400437844 రూ,, 2021 లో 10519 మంది రైతులకు 404402981 రూ,, మొత్తం 2018 నుండి ఈ ఇప్పటి వరకు 1293,408,738 ( 129 కోట్ల 93 లక్షల 4 లక్షల 8 వేల 7 వందల 38 రూపాయలు) రైతుల ఖాతా లో జమచేయడం జరిగిందనీ ఎంపీపీ తెలియజేశారు. అలాగే రైతు భీమ ఈ రోజు వరకు అశ్వారావుపేట మండలాలలో 198 మంది రైతు కుటుంబాలకు 9 కోట్ల 90 లక్షలు రైతు కుటుంబాలకు ఇవ్వటం జరిగిందని అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ నవీన్, సర్పంచ్ సున్నం సరస్వతి, ఎంపిటిసి నారం నాగలక్ష్మి, అశుపాక సర్పంచ్ కొనుసోతు లింగయ్య, తెరాస గ్రామ సేఖ అధ్యక్షులు బొల్లుకొండ చెన్నారావు, మాజీ సర్పంచ్ సున్నం రామలక్ష్మయ్య, అశ్వారావుపేట సోషల్ మీడియా ఇంచార్జ్ జుజ్జురి మనోహర్, రామినేని సత్యనారాయణ, మొడియం జగన్నాధం, జుజ్జురి సత్యనారాయణ, మొడియం సూర్యచంద్రం, రైతులు తెరాస నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: