CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసి సమస్యలపై ఐక్య పోరాటాలు ఉధృతం. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావు.

Share it:

 



మన్యం టీవీ కరకగూడెం:ఆదివాసి సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో జరిగిన సంఘం మండల మహాసభలో ముఖ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం పాలకవర్గాల విధానాల వల్ల 1/70 పీసా చట్టం లాంటి చట్టాలు నీరుగారి పోతున్నాయని వారన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం జీవో నెంబర్ 3 రద్దు చేయడం ఆదివాసీల అస్తిత్వానికి పెద్ద ప్రమాదకరమైనదని షెడ్యూల్ ప్రాంతంలో జుడిషియల్ పరిధి ఉండదని ఈ సందర్భంగా తెలియజేశారు పోడు భూముల నుండి హరితహారం పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి వెళ్ళగొట్టే కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జరుగుతుందని ఏదో తూతూమంత్రంగా హక్కు పత్రాల దరఖాస్తులు స్వీకరించారు. తప్ప ఇంతవరకు చర్యలు మాత్రం శూన్యం అన్నారు 317 జీవో వల్ల ఏజెన్సీ ప్రాంతంలో నియామకాలు ఖాళీల విషయంలో పెద్ద గందరగోళం ఏర్పడింది అని ఇది రానున్న రోజుల్లో ఏజెన్సీ విద్యార్థులకు శాపంగా మారే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని పరిశీలించాలని డిమాండ్ చేశారు రానున్న రోజుల్లో ఆదివాసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించేందుకు ఆదివాసీలు సన్నద్ధమవుతున్నారు.అని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వజ్జా సురేష్ ,సున్నం గంగ ,చర్ప సత్యం ,ఊకె నరసింహారావు, వెంకట్ ,తోలెం జ్యోతిక ,కొమరం సందీప్ కుమార్ ,కణితి రాము, ఏడూళ్ళ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: