CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం.కొత్తగూడెం లో అరెస్ట్ చేసిన సీపీఐ నాయకులను వెంటనే విడుదల చేయాలి.

Share it:




నలుగురు మరణానికి కారణం అయిన వనమా రాఘవ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి:సీపీఐ మణుగూరు పట్టణ,మండల కార్యదర్శులు డిమాండ్


మన్యం టీవీ మణుగూరు:


రాష్ట్రం లో సంచలనం కలిగించి న పాల్వంచ రామకృష్ణ కుటుంబ సభ్యులు నలుగురు సుసైడ్ వీడియో,తో ఆత్మ హత్యా యత్నం చేసుకొని చనిపోవటం.దీనికి కారణం స్ధానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ,భూ సెటిల్ మెంట్ విషయం లో రామకృష్ణ భార్యను అసభ్య కరం గా కోరటం,అధికార యంత్రాంగం, అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు కావటం తో ఏమీ చేయలేని స్థితిలో రామకృష్ణ,తన కుటుంబం మరణానికి కారణం అయిన వనమా రాఘవ పై రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని, వనమా రాఘవ పై ప్రభుత్వం కఠిన శిక్షలను విధించాలని, జిల్లా బహిష్కరణ చేయాలని మణుగూరు పట్టణ,మండల కార్యదర్శులు దుర్గ్యాల. సుధాకర్,ఎస్కె.సర్వర్ డిమాండ్ చేశారు.గతంలో వనమా రాఘవ పై అనేక ఆరోపణలు ఉన్నాయని, వాటిపై న్యాయ విచారణ జరిపి శిక్షించాలని,దీనిపై ఆందోళనకు సిద్ధమైన సీపీఐ రాష్ట్ర,జిల్లా కొత్తగూడెం నాయకులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఘటనకు కారణం ఐన బాధ్యులను నేటికీ పట్టుకొని పోలీస్ లు,న్యాయం కోసం అడిగే వారిని అరెస్ట్ చేయటం సరైంది కాదని,వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు,కార్యదర్శులు తోట రమేష్,అక్కి.నర్సింహారావు,ఏఐటీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు బి వీరాస్వామి, కార్యవర్గ సభ్యులు మంగి. వీరయ్య,వీరమ్మ,కన్నెబోయిన ప్రసాద్,సర్పంచ్ బాడీష.సతీష్, రవికుమార్,యకయ్య,యార్రయా,బుచ్చి రాములు, బాబురావు,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: