CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆశా వర్కర్ ల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్న ప్రభుత్వం --:సి ఐ టీ యు

Share it:


మన్యం మనుగడ మంగపేట.

రాష్ట్ర ప్రభుత్వం ఆశలకు పి.ఆర్.సి ఇవ్వకుండా కేవలం రూ, 7200 లు వేసి మరోసారి మోసoచేసిందని సి.ఐ.టి.యు ములుగు జిల్లా అధ్యక్షుడు మడి రవి అన్నారు.మంగపేట మండల ఆశా కార్యకర్తల సమావేశం ఆదివారం చుoచుపల్లి పి.హెచ్.సి లో ఆశ కార్యకర్త రమాదేవి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా (సి ఐ టి యు ) ములుగు జిల్లా నాయకులు మడే రవి మాట్లాడుతూ ప్రభుత్వం చెప్తున్న మోస పూరిత మాటలు నమ్మవద్దని అన్నారు అదేవిధంగా ప్రభుత్వం ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతున్నామని ప్రకటనఇస్తూ ఆచరణ లో మాత్రం పారితోషికాలు ఇవ్వడ దుర్మార్గంఅన్నారు. అదేవిదంగా పెండింగులో వున్న కోవిడ్ రిస్క్ అలవెన్స్లను నేరుగా ఆశల అకౌంట్ లో జమ చేయాలని అన్నారు. ఈ యొక్క సమస్యలను పరిష్కరిచాలని ఆయన అన్నారు. లేని యడల దశల వారీగా పోరాటలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఆశలు సంభాలక్షి, రమాదేవి, విజయకుమారి, నలిని, శ్రావ్య, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: