CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఐకమత్యం తో మన హక్కులను సాధించుకుందాం.తెలంగాణ రాష్ట్ర టీఎంఎం ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

తెలంగాణ రాష్ట్ర టీఎంఎం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి తెలంగాణా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రజలను ఉద్దేశించి భారతదేశం లో1950 రాజ్యాంగం లిస్ట్ ప్రకారం 1,108 షెడ్యూల్ క్యాస్ట్స్ ఉన్నాయి, నాటి షెడ్యూల్ కులాలు జనాభా దామాషా ప్రకారం 15% రిజర్వేషన్ ఇచ్చారు. 2021 లో కూడ అదే రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఇప్పుడు పెరిగిన జనాభా ప్రకారం మనకు ఎక్కువ రిజర్వేషన్ కల్పించి తీరాలి ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు.భారత్ లో దళిత కులాలు అన్ని ఐక్యతతో మన రిజర్వేషన్ పెంచుకోవాలి కానీ కొంతమంది ఉన్న రిజర్వేషన్ పంచుకోవాలి అంటున్నారు ఇది ఆమోద యోగ్యం కాదు, ఆచరనీయం అంతకన్నా కాదు.భారతదేశం రాజ్యాంగం ప్రకారం ఇది విరుద్ధం షెడ్యూల్ కులాలు అంటేనే అభివృద్ధి చెందని కులాలు అని అర్ధం అటువంటి కులాలు అందరూ ఐకమత్యం తో మన హక్కులు సాధించుకోవాలి. పెరుగతున్న జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచాలని ప్రభుత్వాలతో పోరాటం చేద్దాం. మనం ఏ పార్టీ వారిమైనఏ మతం వారిమైన మన జెండాలు పక్కన పెట్టి దళిత సామజిక సమగ్ర అభివృద్ధి కొరకై కలసి రండి అని ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి దళిత సమాజాన్ని కోరారు.ఎస్సి వర్గీకరణ వద్దు ఐక్యత ముద్దు అని పల్లికొండ యాదగిరి దళిత సమాజానికి హిత బోధ చేశారు.

Share it:

TS

Post A Comment: