CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పొదుమూరు కష్టాలు పట్టించుకొనే ప్రజాప్రతినిధులు, అధికారులు లేరు.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

మండలం లో పొదుమూరు గ్రామ ప్రజల అత్యవసర సమావేశం జరిగింది ఈ సమావేశం లో ముంపు గ్రామం అయిన పొద్దుమూరు కు గోదావరి వరదలు వలన ఉన్న ముప్పు దాని యొక్క పరిణామాలు కరకట్ట యొక్క ఆవశ్యకత గురించి రాజకీయ నాయకులు అధికారులు ముంపు గ్రామం అయిన పొదుమూరు పై వారి యొక్క నిర్లక్ష్యం గురించి యంఆర్పీఎస్, యంయస్పి నాయకులు గుగ్గిళ్ల సురేష్ మాదిగ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్బంగా గుగ్గిళ్ల సురేష్ మాదిగ మాట్లాడుతూ 

మంగపేట మండలం పొదుమూరు గ్రామం లో నివసిస్తున్న ప్రజల సమస్యలు పట్టించుకునే నాథుడే లేడు. ఓట్లు అడగటానికి మాత్రం వస్తారు. అప్పుడు చెప్పే మాటలు ఇచ్చే హామీలు అన్ని ఇన్ని కావు.

ఆరు సంవత్సరాల నుండి పొదుమూర్ గోదావరి ముంపు గ్రామ ప్రజల బాధలు ఎవరికి చెప్పుకున్న సమస్య సమస్య లాగే ఉంది.

మంగపేట మండలం లో గత 2021

 సంవత్సరం నుండి పొదుమూర్ గ్రామ ప్రజలకు గోదావరి ముప్పు ప్రాంతం గా ఉంది పొదుమూర్ గోదావరికి కరకట్టకు 137 కోట్లు మంజూరు అయింది అని చెప్పడం జరుగుతుంది కానీ పనులు మాత్రం ప్రారంభం చేయడం లేదు. అవి నిజంగా మంజూరు అయితే ఇంతవరకు కరకట్ట ఎందుకు మొదలు పెట్టలేదు అసలు ఈ కరకట్ట గురించి ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదు 

ఎన్నికలు వచ్చినప్పుడు పొదుమూర్ గ్రామ ప్రజల ఓట్లు కావాలి అప్పుడు పార్టీ నాయకులు వస్తారు కానీ గ్రామ ప్రజల సమస్యలు గురించి పట్టించుకోరు రాజకీయ నాయకులు చెప్పే పిట్టల దొరల మాటలు ప్రజలు ఈసారి తిప్పి కొడతారు. గోదావరి ముంపు ఉన్న పొదుమూరు గ్రామానికివెంటనే కరకట్ట నిర్మాణం చేపట్టాలి లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగటానికి వచ్చే రాజకీయ నాయకులకు ఓట్లు వేయం ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగటానికి వస్తారు చేతనైతే ఇచ్చిన హామీలు అమలు చేయండి లేదంటే మీ పదవులు రాజీనామా చేయండి అని ఎమ్మార్పీఎస్ మరియు యంయస్పి మంగపేట మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలు ప్రభుత్వానికి మరియు ములుగు జిల్లా పార్టీలు మంగపేట మండల నాయకులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కరకట్ట కట్టించాలి మంగపేట అధికారులు కూడా పొదుమూర్ కరకట్ట విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా పొదుమూరు గ్రామ ప్రజలను ముంపు ముప్పు నుండి కాపాడాలి ఈసందర్బంగా కోరారు. ఈ సమావేశం లో లంజపెళ్లి సమ్మయ్య ,లాలయ్య, శ్రీరాములు, నర్సమ్మ, గంగమ్మ,పుణెము భాస్కర్,దర్రా సతీష్,బద్దీ రఘుబాబు,ఎర్రావుల కృష్ణ సమావేశం పెట్టుకొని మాట్లాడుకోవడం జరిగింది

Share it:

TS

Post A Comment: