మన్యం టీవీ కరకగూడెం : కరకగూడెం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ బ్యాండ్ యూనియన్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండడంతో నూతనంగా ఏర్పడిన బ్యాండ్ యూనియన్ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. అనంతరం బ్యాండ్ యూనియన్ అధ్యక్షుడు జాడి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఇల్లెందుల సత్యం ,మాట్లాడుతూ కరకగూడెం కేంద్రంలో యూనియన్ ఆఫీస్ అందుబాటులో ఉంటుందని వివాహాది శుభకార్యాలకు మేము నిత్యం అందుబాటులో ఉంటామని మండల ప్రజలు లు అందరూ తమ యూనియన్ కు సహకరించాలని వివాహాది శుభకార్యాలు చేసుకునేవారు నేరుగా వచ్చి తమ యూనియన్ ఆఫీసులో పెళ్లి డేట్ ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు కోరారు సరసమైన ధరలు లకు బ్యాండ్ యూనియన్ సభ్యులు మీకు అందుబాటులో ఉంటారని వారు తెలిపారు .ఈ కార్యక్రమంలో గాందర్ల రామనాథం, సిద్ధి లక్ష్మి, గిద్దె రఘుబాబు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: