CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మహిళలు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి--:ఏటూరునాగారం సిఐ సట్ల కిరణ్ కుమార్.

Share it:

 



  •  మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి 
  •  జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి

మన్యం మనుగడ మంగపేట.

మహిళలు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలని ఏటూరునాగారం సీఐ సట్లకిరణ్ కుమార్ అన్నారు ఆదివారం మండలంలోని అకినేపల్లి మల్లారం లో వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో బి ఎమ్ ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన గిరిజన మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని స్వయం ఉపాదే ధ్యేయంగా శిక్షణ పొందాలని అన్నారు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి మాట్లాడుతూ ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలు ముందుకు రావాలన్నారు సకాలంలో శిక్షణ పూర్తి చేసినవారు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా రాయితీతో కూడిన రుణాలు పొందవచ్చునన్నారు స్వయం ఉపాధితో మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ప్రయాణం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందారన్నారు సభాధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదివాసీల అభ్యున్నతి కోసం తమ వనవాసి కళ్యాణ పరిషత్తు అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు అనంతరం కొత్త శిక్షణ పొందుతున్న మహిళలకు మాస్క్ లను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వనవాసి పరిషత్తు అధ్యక్షులు చిట్టిమల్ల శ్యాం ప్రసాద్ ఉమ్మడి వరంగల్ జిల్లా వి కె పి ప్రధాన కార్యదర్శి తాళ్ల సమ్మయ్య ప్రముఖ పారిశ్రామిక వేత్త మందాడి శ్యాం ప్రసాద్ రెడ్డి వీకేపీ మెడికల్ ఆర్గనైజర్ గురురాజ్ వీక్ ఏపీ సభ్యులు కృష్ణ జగదీష్ సాయి బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి వేణు అప్పిన బోయిన విజయలక్ష్మి చైతన్య సంస్థ పౌండర్ ఎర్ర శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: