CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అమాయక ఆదివాసీ గిరిజన మహిళల పై ఫారెస్ట్ గార్డ్ దాడిని ఖండిస్తూ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన.

Share it:


మన్యం మనుగడ, మణుగూరు:

  ములకలపల్లి మండలం లో సాకీవలస ఆదివాసీ మహిళల పై అత్యాచార దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఫారెస్ట్ గార్డ్ మహేష్ పై కేసు నమోదు చేసి ఉద్యోగం నుండి తొలగించాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోరా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాచన్నగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని సాకివలస గ్రామ ఆదివాసీ గిరిజన మహిళల పై ఫారెస్ట్ గార్డ్ మహేష్ అత్యాచార దాడిని,అసభ్య కరంగా ప్రవర్తించడాన్నీ నిరసిస్తూ సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మణుగూరు మణుగూరు సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మణుగూరు మండలం పగిడేరు గ్రామం లో ఆదివాసీల తో కలిసి ప్రభుత్వ దిష్టి బొమ్మను థగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మోరా రవి మాట్లాడుతూ ఎట్టి లక్ష్మి, సోడే దేవమ్మ, సోడే రజిని పొయ్యిలో కట్టెల కోసం అడవికి వెళ్లి కట్టెలు తెస్తున్న సమయంలో ఫారెస్ట్ గార్డ్ మహేష్ అనే వ్యక్తి లక్ష్మీ ,దేవమ్మ లను విచక్షణ కోల్పోయి దాడిచేసి కొట్టడం తో భయాందోళనకు గురైన మైనర్ బాలిక రజిని పారిపోతుండగా వెంటబడి తరుముతుంటే గుంతలో పడి పోయిన బాలికను లంగాపట్టి లాగి బట్టలు ఊడదీసి వివస్త్రను చేసిన ఘటన అడవిలో ఆదివాసుల పై ఫారెస్ట్ వాళ్ళు సాగిస్తున్న ఆటవిక వికృత దాడులకు పరాకాష్ట అని పేర్కొన్నారు ఫారెస్ట్ గార్డ్ వెంటపడి కనీస మానవత్వం లేకుండా అవమానకర పద్ధతుల్లో సమాజం సిగ్గు పడే విధంగా ప్రవర్తించడాన్ని ప్రతిఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు. తక్షణమే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై అత్యాచార నేరం కింద కేసులు నమోదు చేసి ఉద్యోగం నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉందని, ఆదివాసులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రాము , లక్ష్మయ్య, ఇడమయ్య , సమ్మయ్య , రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: