మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి ( 23 ) ఆదివారం : దమ్మపేట మండల కేంద్రంలో ఆదివాసి జేఏసీ అత్యవసర సమావేశం శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బండారు సూర్య నారాయణ మాట్లాడుతూ ములకలపల్లి మండలంలో సాకీ వాగు వద్ద గొత్తికోయ మహిళలపై ఫారెస్ట్ అధికారి దౌర్జన్యం క్షమించరాని నేరమని ఇటువంటి అధికారులపై తక్షణమే ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట డివిజన్ నాయకులు వాడే వీరస్వామి, వంక బాబూరావు, తాటి పోతురాజు, వార్షిక మారేసు, సోయం రామ్మూర్తి , కాసిని వెంకటేశ్వర్రావు, వంక వరాలబాబు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: