CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలాగా సమరోత్సాహంతో పని చేయాలి.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

 మంగపేట మండలం కేంద్రంలో మండల అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార్ ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదు పై రివ్యూ నిర్వహించారు. నల్లెల కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన డిజిటల్ సభ్యత్వ నమోదు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త సద్వినియోగం చేసుకోవాలని ప్రమాద బీమా రెండు లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తెలియజేశారు. ఎన్ రోలర్ గా నియమించబడిన వారు అధిక సంఖ్యలో సభ్యత్వాలు పూర్తి చేయాలని తెలియజేశారు. ములుగు నియోజకవర్గం లోని అన్ని మండలాలలో సభ్యత్వ నమోదు అధిక సంఖ్యలో చేయాలని సూచించారు. మంగపేట మండల సభ్యత్వ నమోదు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి నుండి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సైనికుల లెక్క పని చేసి కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తీసుకువచ్చి అటు కేంద్రం లోను ఇక్కడ రాష్ట్రము లోను అధికారం లోకి తీసుకరావాలి అందుకోసం మనం అందరం అలుపెరుగనిపోరాటం చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు పూజారి సురేంద్రబాబు చింతా పున్నరావు మండల ఉపాధ్యక్షులు తూడి భగవాన్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చిలకమర్రి శ్రీనివాస్ మండల బీసీ సెల్ అధ్యక్షులు ఆదినారాయణ ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు చాద మల్లయ్య కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు చౌలం వెంకటేశ్వర్లు ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పల్లికొండ యాదగిరి సీనియర్ నాయకులు మాసి రెడ్డి వెంకట్ రెడ్డి పొదెం నగేష్ జార సాంబయ్య వెంకటేశ్వర్లు మైల మల్లికార్జున్ ఆకుతోట వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: