CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు పాల్గొన్న మహిళలు..

Share it:

 మన్యం టివి దుమ్మగూడెం:: సీతానగరం గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు ఉల్లాసంగా ఉత్సాహంగా పెద్దఎత్తున ముగ్గులు పోటీలు పాల్గొనడం జరిగింది అనంతరం మహిళా సంఘం మండల అధ్యక్షురాలు సోయం సుశీల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు సరియం రాజమ్మ సిఐటియు మండల కన్వీనర్ చిలకమ్మా మాట్లాడుతూ మన తెలుగువారికి సంక్రాంతి పండగ అంటేనే సందడే సందడి ఆనందంగా ఉల్లాసంగా ఈ పండుగను నాలుగు రోజులు పాటు గ్రామ గ్రామాన ముగ్గులతో అలంకరించడం చుట్టాల బంధువులను కూతుళ్లను కొత్త హల్లులను పిలుచుకొని రకరకాల పిండి వంటకాలు వండి ఆనందంగా ఎంతో సంతోషంగా చేసుకుంటారని ఇది తెలుగువారి సాంప్రదాయమని వారు అన్నారు .కానీ ఈ సంవత్సరం కరోనా వల్ల మంచిగా పాల్గొనే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఫస్ట్, సెకండ్ ,థర్డ్ గెలుచుకున్న వారికి ప్రైజులు ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సరియం రాజమ్మ ,సి ఐ టి యు మండల కన్వీనర్ చిలకమ్మా, స్థానిక ఉపసర్పంచ్ వాగే ఖాదర్ బాబు చేతుల మీదుగా 1)వెంకటమ్మ 2) నాగమణి 3) లావణ్య లకు బహుమతులు అందించడం జరిగింది ఈ పోటీలో పాల్గొన్న వారికి కూడా బహుమతులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు పార్వతి ,రత్నం ,రాజేశ్వరి, వెంకటమ్మ ,నాగమణి, లావణ్య, వరలక్ష్మి, లక్ష్మి, బి.జయమని, భార్గవి, రేఖ ,హిందూ ,మానస తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: