CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎమ్మెల్యే వనమాను సస్పెండ్‌ చేయాలి.వనమా రాఘవను అరెస్ట్‌ చేయాలి..

Share it:

 



  • రాష్ట్రం లో అరాచక పాలన కొనసాగుతుంది.
  • నాలుగు రోజులు గడుస్తున్న పోలీసులు రాఘవ ను అరెస్ట్ చెయ్యకపోవడం లో ఆంతర్యం ఏమిటో.
  • రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

 మన్యం మనుగడ ఏటూరు నాగారంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది..ఇక,తన ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది..తన కుటుంబం ఆత్మ హత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవయే కారణమనేది రామకృష్ణ చేసిన ప్రధాన ఆరోపణ..డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని..కానీ,ఏ భర్త కూడా వినగూడని మాట వనమా రాఘవ అడిగారు..నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని అడిగాడని.. ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే,ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ తన భార్యను పంపమని ఆదేశించాడని మృతుడు రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు..ఈ దారుణాన్ని తట్టుకోలేక రామకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడన్న రామకృష్ణ యొక్క ఆశ్చర్యకరమైన చివరి సెల్ఫీ వీడియో వనమా రాఘ వేంద్ర కొత్తగూడెం ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రావు యొక్క దౌర్జన్యాలను వెల్లడి స్తుందన్నారు.ఈ కేసులో వనమా రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలని..ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని సీతక్క డిమాండ్‌ చేశారు.ఒక కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నా.. ఇప్పటి వరకు అధికార పార్టీ స్పందించకపోవడం దారుణమైన విషయమని, ఎందుకు స్పందించడం లేదని ఈ ఘటనపై కేసీఆర్‌ వెంటనే స్పందించాలని..ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని సీతక్క డిమాండ్ చేశారు.

Share it:

TS

Post A Comment: