CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు ను పార్టీ నుండి సస్పెండ్‌ చేయాలి.వనమా రాఘవను అరెస్ట్‌ చేసి కటినంగా శిక్షించాలి.

Share it:



  • రాష్ట్రం లో అరాచక పాలన కొనసాగుతుంది.
  • నాలుగు రోజులు గడుస్తున్న పోలీసులు రాఘవ ను అరెస్ట్ చెయ్యకపోవడం లో ఆంతర్యం ఏమిటో.
  • రాష్ట్రం లో మహిళలకు రక్షణ లేదు.
  • ములుగు జాతీయ రహదారి పై బయటించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
  • రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవళి రెడ్డి,జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి. 

మన్యం మనుగడ ఏటూరు నాగారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ ఆత్మ హత్యకు కారణం అయిన ఎమ్మెల్యే వనమా వెంకటే శ్వరరావు కుమారుడు వనమా రాఘవ ను అరెస్ట్ చేసి కటినంగా శిక్షించాలని కోరుతూ ములుగు జాతీయ రహదారి పై ధర్నా రాస్తో రోకో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు 

ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు ఇంచార్జీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుచన రవళి రెడ్డి జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి మాట్లాడుతూ. 

ఎమ్మెల్యే వనమా వెంకటే శ్వరరావు కొడుకు వనమా రాఘవ రామకృష్ణ భార్యను పంపమని ఆదేశించాడని ఈ దారుణాన్ని తట్టుకోలేక రామకృష్ణ కుటుంబంతో సహా ఆత్మ హత్య చేసుకొని 5 రోజులు కావస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం పోలీస్ అధికారులు నిందితున్ని పట్టుకొక పోవడం దారుణమని కొంత మంది పోలీస్ అధికారులు అధికార పార్టీ నాయకులకు తోత్తులుగా వ్యవహరించడం బాధాకరం అని రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఒక బాధ్యత గల ప్రజా ప్రతినిధి కుమారుడు వనమా రాఘవ ఒక కుటుంబాన్నీ బలిగొన్న ఇప్పటి వరకు అతన్ని అరెస్ట్ చెయ్యక పోవడం దారుణమని వనమా రాఘవను వెంటనే అరెస్ట్ చేసి కటినంగా శిక్షించాలని,ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.ఒక కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నా..ఇప్పటి వరకు అధికార పార్టీ స్పందించ కపోవడం ముఖ్య మంత్రి కి తగదని కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై కేసీఆర్‌ వెంటనే స్పందించాలని..ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ 

డిమాండ్ చేస్తుందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి,సర్పంచ్ గండి కల్పన కుమార్,గ్రామ కమిటీ అధ్యక్షులు గుండ భిక్షపతి,రాజన్న,దారావత్ సారయ్య,మాజీ వార్డు సభ్యులు ఓం ప్రకాష్,మాజీ సహకార సంఘం చైర్మన్ రాజేశ్వర్ రావు,కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యాం,మైనార్టీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి మౌలానా,సీనియర్ నాయకులు వక్కల నర్సయ్య,

అర్శం రఘు,మాజీ సర్పంచ్ తప్పెట్ల మొగిలి,కంది మొగిలి,మొలుగురి మొగిలి,నిమ్మల సాంబయ్య,హాజీ పాషా,కవ్వం పెల్లి సారయ్య,గండ్ర త్ విజయకర్,ఛక్రపు రాజు,మేడం రమణకర్,సాంబయ్య,సదయ్య

రాజయ్య,మొగిలి,లక్ష్మయ్య

తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: