CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బోడు పాఠశాలలో విద్యార్థి సంఘాల పట్ల దురుసు ప్రవర్తన ఖండిస్తున్నాం---- రాజకీయ అఖిలపక్ష పార్టీలు, ప్రజా,కులసంఘాలు

Share it:

 

               

బోడు పాఠశాలకు రావద్దు అని విద్యార్థి సంఘాల నాయకులను దూషిస్తూ బ్యాడ్జీలు తీసి బయటకు వెళ్లండి అంటూ బోడు పాఠశాల చైర్మన్ పోతుగంటి వీరభద్రం మరియు తన అనుచరులు వ్యవహరించిన తీరు సరైందికాదని బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని రాజకీయ అఖిలపక్ష పార్టీల నేతలు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ టేకులపల్లి మండల కార్యదర్శి డివిబి చారి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం మండల కార్యదర్శి బానోతు ఊక్లా, సిపిఐ మండల కార్యదర్శి రామచందర్ తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షులు మెంతెన సంజీవ రావు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మెంతెన ప్రభాకర్, బి ఎస్ పి ఇల్లందు నియోజక వర్గ నాయకులు ప్రతాప్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మధు వర్గం మండల కార్యదర్శి కల్తీ వెంకటేశ్వర్లు అన్నారు. ఈరోజు బోడు పాఠశాలలో జరిగిన సంఘటన పై స్పందిస్తూ విద్యాసంస్థలలో ఎక్కడ సమస్య ఉత్పన్నమైన విద్యార్థి సంఘాలు స్పందించడం చాలా సహజమని ఈ విషయంపై పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ కు కనీస అవగాహన లేదని వారు ప్రశ్నించారు.విద్యార్థి సంఘాల పట్ల ఉద్దేశపూర్వకంగానే వీరభద్రం మరియు తన అనుచరులు దాడి చేసేందుకు సిద్ధపడ్డారని పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను పక్కదారి పట్టించి నిందితులను కాపాడేందుకే వారు వ్యవహరించిన తీరు ఉందని అన్నారు.విద్యార్థి సంఘాలు పాఠశాలల అభివృద్ధికి ఆటంకం కాదని పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేసి విజయం సాధించిన సంఘటనలు కూడా ఉన్నాయని వారు తెలిపారు. కానీ పాఠశాలకు విద్యార్థి సంఘాలు రావద్దు అని అనడం సబబు కాదని వారు విద్యార్థి సంఘ నాయకులను అన్న మాటలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Share it:

TS

Post A Comment: