CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రో వాలీబాల్ లీగ్ సెలెక్ట్ అయిన దుమ్ముగూడెం మండలానికి చెందిన ఆదివాసి బిడ్డ..

Share it:

 



మన్యం మనుగడ::

దుమ్ముగూడెం మండలం,పాత మారేడుబాక గ్రామం,గుండి వారి గుంపులోని నిరుపేద కుటుంబానికి చెందిన గిరిజన అబ్బాయి.

పేరు తుర్రం నవీన్ నేషనల్ వాలీబాల్ టీం సెలెక్ట్ అయినందున పలువురు మండల అధికారులు,నాయకులు , అభినందిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో గల మద్రాసు యూనివర్సిటీ,లొయోలా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు,తల్లి పేరు శేషమ్మ,తండ్రి పేరు సారయ్య చిన్న తనంలోనే చనిపోయాడు.వీరికి ఇద్దరు పిల్లలు కొడుకు నవీన్,చెల్లి వసంత తల్లి ఉన్న కొంత పొలం వ్యవసాయం చేసుకుంటూ కష్టపడి కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తుంది.నవీన్ క్రమశిక్షణ కలిగి చదువుతో పాటు క్రీడల మీద మక్కువతో అత్యుత్తమ నైపుణ్యంతో వాలీబాల్ ఆటల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నాడు.ఇతని ప్రతిభను గుర్తించిన చెన్నై వారు ఇతన్ని సెలెక్ట్ చేసి *ప్రో వాలీబాల్ లీగ్* లో ఆడించడానికి స్పాన్సర్ గా నిలబడ్డారు.వచ్చే నెల ఫిబ్రవరిలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమయ్యే ప్రో వాలీబాల్ లీగ్ఆటల్లో ఆడే అవకాశం వచ్చింది.చెన్నై టీం తరపున ఆడబోతున్నాడు. చెన్నై బ్రిడ్జ్ టీం కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు నేషనల్ ఎలక్ట్రానిక్ మీడియాలు ఈ ఆటలను కవర్ చేస్తాయి.ఇతను ఇప్పటి వరకు కొన్ని చోట్ల నిర్వహించిన ఆటల్లో చాలా మెడల్స్ గెలిచాడు.2 సంవత్సరాల క్రితం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ టోర్నీల అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి కప్పు మరియు నగదు గెలుపొందిన జట్టులో నవీన్ కూడా ఉన్నాడు.ఉత్తమ క్రీడాకారుడిగా సెలెక్ట్ చేసి ఎలక్ట్రానిక్ స్కూటీని కూడా బహూకరించారు. నేషనల్ వాలీబాల్ లీగ్ సెలెక్ట్ అయినా తుర్రం నవీన్ మండలంలోని. ప్రముఖులు అందరూ అభినదిస్తున్నారు

Share it:

TS

Post A Comment: