CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పబ్లిక్ టాయిలెట్ ప్రారంభించిన జెడ్ పి టి సి, ఎంపీడీవో, ఎమ్మార్వో.

Share it:

 


మన్యం మనుగడ వాజేడు జనవరి 26.


వాజేడు మండల కేంద్రంలోని స్వచ్ఛ భారత్ మిషన్ పథకం కింద ఆరు పబ్లిక్ టాయిలెట్లు మంజూరు అయ్యాయి. ఒక్కొక్క పబ్లిక్ టాయిలెట్ కి, రూ: మూడు లక్షలు రూపాయలు,ఎస్ బి ఎం ద్వారా రెండు లక్షల పది వేలు మంజూరు కాగ, తొంభై వేలు గ్రామపంచాయతీ నిధులతో నిర్మాణాలు చేపట్టారు. రెవిన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలతో ఎన్ హెచ్ 163 జాతీయ రహదారి పక్కన కొంగల, మొరుమూరు,గ్రామ పంచాయతీ రహదారి పక్కన నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను గణతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం, విజయ మాట్లాడుతూ... ప్రజలందరూ ఈ సామూహిక మరుగుదొడ్లను వినియోగించుకోవాలని బహిరంగ మల మూత్ర విసర్జన చేయవద్దని అలా చేసినట్లయితే స్త్రీల ఆత్మగౌరవం దెబ్బతింటుందని బహిరంగ మల మూత్ర చేయటం వలన స్త్రీల పైన అత్యాచారాలు జరుగుతున్నాయని, చెట్టు చాటుకు, పుట్ట చాటుకు, కూర్చోవడం వల్ల పాములు తేలు కాటువేసే ప్రమాదం పొంచి ఉందని, లేవడం కూర్చోవడం, కూర్చోవడం లేవడం వలన, స్త్రీల గర్భసంచి పై ఒత్తిడి పడే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు పబ్లిక్ టాయిలెట్లను వినియోగించుకోవాలని కోరారు. అలాగే మిగతా గ్రామపంచాయతీల్లో నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్లు త్వరితగతిన పూర్తిచేయాలని సర్పంచులకు, సంబంధిత కాంట్రాక్టర్లకు ఆదేశించారు. వ్యక్తం చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు. మాస్కులు, శానిటైజర్, భౌతిక దూరం పాటించాలని బహిరంగ మల మూత్ర విసర్జన చేయటం వలన కరోనా విజృంభించి ప్రమాదకరంగా మారె అవకాశం ఉందని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం విజయ, రెవెన్యూ అధికారి అల్లం రాజ్ కుమార్, ఎంపీపీ శ్యామల శారద, జెడ్పిటిసి తల్లడి పుష్పలత, సర్పంచులు, కార్యదర్శులు వార్డ్ నెంబర్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: