CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అక్రమ అరెస్టులను ఖండించండి.న్యూడెమోక్రసీ నేత మోర రవి.

Share it:

 


  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం పాత పాల్వంచ లో నాగ రామకృష్ణ కుటుంబం బార్య, భర్త, ఇద్దరు పిల్లల ఆత్మహత్యలకు కారకుడైన నరహంతకుడు, కామ పిశాచి, అరాచకుడైన వనమా రాఘవ అరాచకాలను నిరసిస్తూ ఈ రోజు పాల్వంచ కొత్తగూడెం బంద్ నిర్వహిస్తున్న న్యూడెమోక్రసీ, అఖిల పక్ష నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోర రవి పేర్కొన్నారు. మణుగూరు బాపనకుంట లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మోర రవి మాట్లాడుతూ పాల్వంచలో కుటుంబంతో సహా నలుగురి మరణాలకు కారకుడైన అరాచకునికి మద్దతుగా మాట్లాడుతున్న రాఘవ తండ్రి వనమా వెంకటేశ్వరావు నైతిక బాధ్యత వహిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వనమా రాఘవ లాంటివాళ్లు ధనార్జనే ధ్యేయంగా సెటిల్మెంట్లు భూదందాలు బెదిరింపులకు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ అధికార టీ ఆర్ ఎస్ పార్టీని అడ్డంపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వనమా వెంకటేశ్వరావును ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని TRS ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టాలు ధనికులకు చుట్టాలుగా మారాయని, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, అధికార యంత్రాంగం మొత్తం దుర్మార్గుడైన వనమా రాఘవేంద్ర నేరాల విషయంలో అనేక సంవత్సరాలుగా ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన జరిగిందని అన్నారు రాఘవ అరాచకాలకు ఇప్పటికైనా చరమగీతం పాడాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు, అధికార మదంతో అనేక కుటుంబాల నాశనానికి కారణం అయ్యాడని విమర్శించారు. ఈ నిరసన దేశ వ్యాప్తంగా రగులుకోక ముందే దుర్మార్గుడైన రాఘవను అరెస్టు చేయాలని, ఉరిశిక్ష విధించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ వనమా వెంకటేశ్వరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు , రాఘవేంద్రరావును అరెస్టు చేసి కఠినంగా శిక్షించే వరకు ప్రజా నిరసనలు ప్రభుత్వం ఎదుర్కోక తప్పదని అన్నారు. నేరస్తులను ఇంతవరకు అరెస్టు చేయకుండా శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న అఖిలపక్షం నాయకులను, నిరసన కారులను అక్రమంగా అరెస్టులు చేయడం సరికాదన్నారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదయ్య , వైయస్ రెడ్డి , కొమరయ్య , సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: