CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బాలికలు చదువుతోపాటు పర్యావరణ పరిరక్షణ బాధ్యత కలిగి ఉండాలి..తహశీల్దార్, శ్రీనివాస్ యాదవ్.జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్, స్టేషనరీ, పాదరక్షలు, నిత్యావసర వస్తువులు పంపిణీ... ఫౌండేషన్ సేవలను కొనియాడిన MRO...

Share it:

 





విద్యార్థినిలు చదువుతోపాటు సామాజికస్పృహ పర్యావరణ పరిరక్షణ పై బాధ్యత కలిగి ఉండాలని కోరారు భద్రాచలం తహశీల్దార్ శ్రీనివాస్ యాదవ్ ఈ మేరకు జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తహశీల్దార్ మాట్లాడుతూ, జేడీ ఫౌండేషన్ కార్యక్రమం అంటేనే ముందుంటానని, తెలంగాణ అంతటా కార్యక్రమాలు చేపడుతున్న జెడి పౌండేషన్ ని ప్రశంసించారు, ముందుగా శ్రీనివాస్ యాదవ్ పాఠశాల ఆవరణలో శ్రీ పి. మునీంద్ర బాబు ( DRDO సలహాదారు) పేరిట మొక్క ని నాటి జాతీయ జెండా ఉన్న ట్రీ గార్డ్ ని ఏర్పాటు చేశారు. అనంతరం MRO మాట్లాడుతూ ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొత్త కొత్త రకాల వైరస్లు పొంచి ఉన్నందున తప్పనిసరిగా విద్యార్థులు తో పాటు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రత కలిగి ఉండాలని కోరారు. ఇటువంటి సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాలు చేస్తున్న జెడి ఫౌండేషన్ భాద్యుడు మురళి మోహన్ కుమార్ తో పాటు వారి సభ్యులను అభినందించారు. అంతే కాకుండా అందరూ కూడా మంచిగా చదువుకొని జీవితం లో ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జేడీ పౌండేషన్ భాద్యుడు శ్రీ మురళీ మోహన్ కుమార్ మాట్లాడుతూ భద్రాచలం పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో చదివే బాలికలకు హైదరాబాద్ కి చెందిన we are with you అనే సంస్థ సహకారంతో నిత్యావసర వస్తువులు,నోట్ బుక్స్,ఇతర స్టేషనరీ అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జె.డి ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి హన్సి,శ్రీ క డాలి నాగరాజు , శ్రీ యూసఫ్ మియా,తో పాటు బాలికల ఉన్నత పాఠశాల పర్యవేక్షకురాలు శ్రీమతి పార్వతి ,SMC చైర్మన్ శ్రీమతి స్వరూప ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: