CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అశ్వారావుపేటలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుక.

Share it:

 



 మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో కెమిలయిడ్స్ వారి సౌజన్యంతో రింగ్ సెంటర్ నందు వివేకానంద వికాస కేంద్రం వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ వేణుగోపాల్ రావు, వికాస కేంద్రం సభ్యులు వికేడివిఎస్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ శేషు బాబు, శ్రీనివాస రాజు మాట్లాడుతూ మానవజాతికి వివేకానంద స్వామి చాలా గొప్ప స్పూర్తి దాయకుడు అని, తెలిపినారు వివేకానంద స్వామి 

భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి, వివేకానందుడికే దక్కుతుందని తెలిపినారు, అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారని, భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద అని, అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరథం పట్టిందని గుర్తు చేసినారు, ఎంతో మంది అతనికి శిష్యులయ్యారని, పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి కూడా వివేకానంద స్వామి అని, తూర్పు దేశాల తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్) లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని తెలిపినారు. భారత దేశం లొ రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేసిన గొప్ప మహా వ్యక్తి అని కొనియాడారు, అంతటి గొప్ప వ్యక్తి ముప్ఫై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించడం చాలా బాధాకరం అని తెలిపినారు . వివేకానంద స్వామి చేసిన సేవలకు గుర్తింపుగా 1984 లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించిందని తెలిపినారు. ఈ కార్యక్రమం అనంతరం ఇటీవల నిర్వహించిన ఆటపాటల నందు, క్విజ్ నందు ప్రతిభావంతుల విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో కెమిలయిడ్స్ సిబ్బంది శివరామకృష్ణ, మోహన్ రావు, పంచాంగం రఘునాదం, లైన్స్ క్లబ్ అధ్యక్షులు కొటారి, చలపతి, లైన్స్ క్లబ్ సభ్యులు సురేష్ యు ఎస్ ప్రకాష్ రావు, అశ్వరావుపేట వాసవి క్లబ్ అధ్యక్షులు శీమకుర్తి సుబ్బారావు, జోన్ చైర్మన్ భోగవల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: