CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

స్వామి వివేకానంద జయంతి సందర్బంగామొక్కలు నాటిన తిమ్మంపేట యువత.

Share it:


మన్యం మనుగడ మంగపేట.

మంగపేట మండల పరిధిలో తిమ్మంపేట గ్రామంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిలు లోడే శ్రీనివాస్ చిట్యాల రాజశేఖర్ అధ్యక్షతన బూత్ అధ్యక్షులు వేల్పుల తిరుపతయ్య సల్లూరి రాజేందర్ దంతేన పెల్లి సత్యం సహాయ సహకారాలతో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణ హాజరై వివేకానంద గారి జయంతి సందర్భంగా ఎఫ్ సి ఐ గోదాం ఆవరణలో మొక్కలు నాటారు. మరియు డా బి ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర స్వామి వివేకానంద చిత్ర పటానికి పూల మాలలతో అలంకరించి నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత, భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు అని కొనియాడారు. యువతకు యువజనోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యువత కష్టపడే గుణాన్ని అలవర్చుకోవాలి అని, యువత అన్ని రంగాల్లో ముందుండాలని సూచనలు చేశారు .ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అల్లె జనార్దన్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు జబ్బా సమ్మయ్య జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు ఎం డి పాషా జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు మైనారిటీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగులు మీరా ఓబీసీ దళిత మోర్చాల జిల్లా ఉపాధ్యక్షులు ముత్తెబోయిన నర్సింహారావు జాడి రాంబాబు జిల్లా కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు దంతేన పెల్లి నరేందర్ జిల్లా నాయకులు మల్ రెడ్డి సుధాకర్ రెడ్డి గిరిజన మోర్చా జిల్లా కోశాధికారి కోరేం నారాయణ బీజేవైయం జిల్లా కార్యదర్శి బొంబోతుల మురళి మండల మండల ఉపాధ్యక్షులు చీకట్ల యకస్వామి, అబ్బెరబోయిన లక్ష్మన్ కోశాధికారి గాదె శ్రీనివాస్ మండల యువమోర్చా అధ్యక్షప్రధాన కార్యదర్శిలు రాంగాని అనిల్ సత్యనారాయణ దళిత మోర్చా మండల అధ్యక్షుడు దుర్గం నర్సింహారావు ఉపాధ్యక్షుడు కావిరి నారాయణ కోశాధికారి గాంధేర్ల సంతోష్ సీనియర్ నాయకులు భూక్య రతన్ సింగ్ చిన్నపెళ్లి సమ్మయ్య ఎర్ర సింగ్ ఎంగన్న గిరిజన మోర్చా మండల నాయకులు లోడిగే మధుకర్ ఈక సురేష్ పెండెం సమ్మయ్య కెక్కెర అక్కేమ్మ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: