CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

హైదరాబాద్ డైరక్టర్ కార్యాలయం ఎదుట AITUC ధర్నా.గ్రేడ్ 2 సూపర్ వైజర్ పరీక్ష రద్దు చెయ్యాలి..

Share it:

 





అంగన్వాడీ గ్రేడ్2 సూపర్ వైజర్ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్ icds డైరెక్టర్ కార్యాలయంలో ఎదుట ఏఐటీయూసీ అంగన్వాడీ టీచర్స్ & హెల్పేర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పరీక్ష రద్దు చేయాలని. డిపార్ట్మెంట్ సిలబస్ తో తిరిగి పరీక్షలు నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు కు నాయం చెయ్యాలి అని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ్ పావని. అధ్యక్షురాలు సాయి ఈశ్వరి. ప్రధాన కార్యదర్శిరాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి ch సీతా మహాలక్ష్మి.రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరాటి ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం icds లో ఖాళీ లు భర్తీ చెయ్యకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చాలా ఏళ్ల కాలం తరువాత గ్రేడ్2 పరీక్షలు పెట్టి సుమారు 16వేల మంది అబ్యర్డులు పరీక్ష రాస్తే అందరూ బిత్తర బోయే స్థితిలో పేపర్ ias గ్రూప్1 స్థాయి లో పేపర్ రావటం తో అందరూ ఇబ్బందులు పడుతున్నారు అని 40 పేజీల పేపర్ ను ఇచ్చి 90 ప్రశ్నలు. 90 జవాబులు .90 నిమిషాలు లో ఎలా ఆన్సర్ ఇస్తారు అని జవాబులు కూడా పేరాలు పేరాలు గా ఇచ్చి 10వ తరగతి స్థాయి కల్గిన అంగన్వాడీ టీచర్స్ ఎలా స్థాయి కి మించి వచ్చిన పేపర్ ఎలా రాస్తారో అధికారులు ప్రభుత్వం చెప్పాలి అని ప్రశ్నించారు.

   చాలా మంది అబ్యర్డులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంది అని 50 ఏళ్ళు ఉన్న వాళ్లకు మరో సారి అవకాశం రాదు అని ఆవేదన చెందుతున్నారు అని అన్నారు.

     తక్షణమే ప్రభుత్వం జరిగిన పొరపాటు ను పరిశీలించి వీలైనంత త్వరగా పరీక్ష రద్దు చేయాలని. తక్షణమే మరలా పరీక్ష నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. Icds సిలబస్ తో icds అధికారులు చే తయారు చేసిన పేపర్ అందించాలి అని.వయసు ను బట్టి సర్వీస్ ను బట్టి అదనపు మార్కులు విధానం ను పరిశీలించాలి అని డిమాండ్ చేశారు

    ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

 ఈ కార్యక్రమంలోఏఐటీయూసీ నాయకులు భవాని .లక్ష్మీ మణి. వెర్పుల మల్లికార్జున్. భాగ్యలక్ష్మి. రమణ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: