CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ములుగు జిల్లా కేంద్రానికి సమ్మక్క సారక్క నామ కరణం చెయ్యాల్సిందే.ఫిబ్రవరి 8 నుండి గట్టమ్మ నుండి మేడారం వరకు జరిగే పాదయాత్ర 10 వరకు 17,18 న జరిగే దీక్షలను జయప్రదం చేయండి..

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారక్క సన్నిధిలో బుధవారం కరపత్రాలను ఆవిష్కరించిన ఆదివాసీ సంఘాలు ప్రజా సంఘాల సమైక్య నాయకులు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు చింత కృష్ణ అధ్యక్షతన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. కరపత్ర ఆవిష్కరణ కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ పొడెం రత్నం హాజరై సమ్మక్క సారక్క సన్నిధిలో మాట్లాడుతూ.ములుగు జిల్లా కేంద్రానికి సమ్మక్క సారక్క నామకరణం చేయాలని రత్నం డిమాండ్ చేశారు.కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు ములుగు జిల్లా కేంద్రానికి సమ్మక్క సారక్క నామకరణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.జాతర సందర్భంగా ఉద్యమాలు ఉద్ధృతం

చేస్తామని ములుగు జిల్లా కేంద్రానికి సమ్మక్క సారక్క నామకరణం చేసేంతవరకు ఊరుకునే ప్రసక్తేలేదని ఆయన అన్నారు.ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజాసంఘాల జెఎసి చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ చేస్తున్న పాదయాత్రకు దీక్షలకు అన్ని వర్గాల ప్రజలు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థులు మేధావులు ప్రజలు ప్రజా స్వామిక వాదులు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి మహాజన సోషలిస్టు పార్టీ ములుగు జిల్లా కో ఆర్డినేటర్ ఇరుగు పైడి మాదిగ హాజరై మాట్లాడుతూ ములుగు జిల్లా కేంద్రానికి సమ్మక్క సారక్క నామకరణం ఎందుకు చేయడం లేదని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రం కూడా సమ్మక్క సారక్క దయవలన ఏర్పడిందని ఆయన అన్నారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ ఆదేశాను సారం ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయాలని ఉద్యమంలో పాల్గొంటున్నానని ఇక నుండి ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క నామకరణ చేసే వరకు ఎమ్మార్పీఎస్ మహాజన సోషలిస్టు పార్టీ ముంజల బిక్షపతి చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతుగా పాల్గొంటూ ఇకనుండి ప్రత్యేక ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు.ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గజ్జల ప్రసాద్ మాట్లాడుతూ ములుగు జిల్లా కు వనదేవతల పేర్లు పెట్టడానికి కెసిఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారనీ,కెసిఆర్ కు వనదేవత అంటే ఇష్టం లేదా ఆదివాసుల దేవతలు కాబట్టే నిర్లక్ష్యం వహిస్తున్నారు అందుకే ఆదివాసుల దేవతలు కాబట్టి అణిచి వేస్తున్న కేసీఆర్ అని ప్రసాద్ డిమాండ్ చేశారు. యమ్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ బొమ్మకంటి రమేష్ వర్మ మాట్లాడుతూ.కెసిఆర్ ఇతర జిల్లాలకు దేవతల పేర్లు ఎందుకు పెట్టినారనీ,ములుగు జిల్లా కు ఎందుకు పెట్టడం లేదు గద్వాల్ కు జోగులాంబ అని సిరిసిల్ల కు వేములవాడ రాజన్న అని కొత్తగూడెం కు భద్రాద్రి అని భువనగిరికి యాదాద్రి అని ఈ విధంగా దేవతల పేర్లు పెట్టిన కెసిఆర్ ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క నామకరణం ఎందుకు చేయలేదు అని ఆయన విమర్శించారు.కెసిఆర్ కు నచ్చిన దేవుడు భువనగిరికి యాదాద్రి కొడుకు కేటీఆర్ కు నచ్చిన దేవుడు వేములవాడ రాజన్న అందుకే సిరిసిల్లకు వేములవాడ రాజన్న ఈ విధంగా దేవతల పేర్లు పెట్టిన కేసీఆర్ ములుగు జిల్లా కు సమ్మక్క, సారక్క నామకరణం పెట్టాల్సిందే అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కళ్ళు పల్లి రమేష్ మాదిగ, ప్రజా సంఘాల నాయకులు సామర్ల గణేష్,చంటి,రవి, సారయ్య,శ్రీనివాస్,మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: