CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన పంచాయతీ కార్యదర్శులు.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

మండలం లో పంచాయతి కార్యదర్శుల నిర్లక్ష్యం పెరిగిపోయిందని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో యంపిడివో కు వినతి పత్రం అందచేయడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు మడె రవి ఎస్ యఫ్ఐ జిల్లా నాయకులు టి రవి మాట్లాడుతూ మండలం లోని పంచాయతి కార్యదర్శులు ఆఫీస్ సమయానికి రాకుండా వారి ఇష్టం వచ్చిన సమాయానికి వచ్చి పోతున్నారు గ్రామ పంచాయతి కార్యాలయం లో 1 గంట లేదా 2 గంటల వరకే వుంటున్నారు ప్రజా క్షేత్రం లోఉండి ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సిన పంచాయతీ కార్యదర్శులు బాధ్యతలు మరుస్తున్నారు. ప్రజా సమస్యలు సమస్యలు చెప్పుకోవటానికి వెళ్తే పంచాయతి కార్యదర్శి లు ఉండటం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని తెలియజేశారు. అదేవిదంగా సంబంధిత పై అధికారులు నెలకు నాలుగు సార్లు వచ్చి విచారణ జరిపించాలని ప్రజా సంఘాలనుంచి నుంచి కోరుతున్నాము లేని యెడల ప్రజా సంఘాల నుంచి దశల వారీగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యాక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చిన్నా, పవన్, వంశీ, సాంబయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: