CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

317 జి.ఓ రద్దు చెయ్యాలి.

Share it:

 


మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి 05 ;-  

ఈ రోజు మండలం కేంద్రం లో దమ్మపేట మండల ఆదివాసీ జె.ఎ.సి నాయకుల అత్యవసర సమావేశం జరిగింది.ఈ సమావేశం కి గోండ్వానా విద్యార్థి పరిషత్ మండల అధ్యక్షుడు మడకం ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశం కి దమ్మపేట మండలం జె.ఎ.సి అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినా 317 జి.ఓ తక్షణమే రద్దు చెయ్యాలి అని డిమాండ్ చేసారు.భారత రాజ్యాంగం లో ఐదవ షెడ్యూల్ లో హక్కులు కాలరాసే విధముగా జోనల్ విధానము వల్లా నిరుద్యోగం,కుడా పెరుగుతుంది అని ఆవేదన వ్యక్తము చేసారు.ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతం లో గిరిజన సలహా కమిటీ(టి.ఎ.సి) లో చర్చించకుండా గవర్నర్ ఆమోదం లేకుండ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ చెయ్యడం రాజ్యాంగం వ్యతిరేకం అని అన్నారు.టి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఆదివాసీ వ్యతిరేక విధానాలు అమలు చేస్తుంది అని అన్నారు.తక్షణమే317 జి.ఓ నీ రద్దు చేయలని లేకపోతె దశలు వారి గా ఉద్యమాలు చేపడతామని ఈ సందర్బంగా హెచ్చరించారు.ఈ సమావేశం లో అశ్వారావుపేట నియోజిక వర్గ ఆదివాసీ యువ నాయకులు వాడే వీరాస్వామి నాయకపోడ్ నాయకులు కాసిని వెంకటేశ్వరరావు,వాసం వాసం పోలయ్య,ఆదివాసీ సీనియర్ నాయకులు సోయం రామ్మూర్తి,తాటి పోతురాజు ,ప్రశాంత్, వంకా బాబూరావు,పార్శిక మారేష్ మొదలగు వారు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: