CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కోవిడ్ నియమాలను ఉల్లంగిస్తే కటిన చర్యలు -సీఐ బంధం ఉపేంద్ర రావు.

Share it:



మన్యంటీవి, అశ్వరావుపేట:ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను కఠినంగా అమలు పరుస్తామని సిఐ బంధం ఉపేంద్ర రావు తెలిపారు. అశ్వరావుపేట పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నుండి తెలిపారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగకూడదని, ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించి మాత్రమే ఇంటి నుండి బయటకు రావాలని సభలు సమావేశాలు జరపరాదని సూచించారు. స్కూల్కి వెళ్లే విద్యార్థులు సైతం పాఠశాలలు తప్పనిసరిగా విద్యార్థులు మాస్క్ ధరించేలా చూడాలని కోరారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులకు గురి కాకూడదనే అంశాలను దృష్టిలో పెట్టుకొని నియమ నిబంధనలు కఠినంగా అమలు పరుస్తామని ప్రజలంతా సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు. మాస్కు ధరించకుండా తిరిగి నట్లయితే వెయ్యి రూపాయలు ఫైన్ విధించడం జరుగుతుందని అన్నారు. ఎటువంటి ర్యాలీలు బహిరంగ సమావేశాలు అనుమతి లేదని, మతపరమైన రాజకీయ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించకూడదని షాపులు మాల్స్ ప్రజా రవాణా వాహనాలు సంస్థలు ఆఫీసులోకి మాస్కులు లేకుండా అనుమతించకూడదని అలా అనుమతి ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరిని ధర్మల్ స్కాన్ చేసి సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఏకంగా అందరికీ శానిటైజర్ అందుబాటులో ఉంచి షాపులు మాల్స్, శానిటైజర్ చేయించాలని తెలిపారు. జీవో నెంబర్ వన్ ప్రకారం జనవరి 10 నుండి ఈ ఆంక్షలను అమలు పరచడం జరుగుతుందని, అధికమించి నిబంధనలు పాటించకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయన తెలిపారు. ఆంక్షలను అనుకరిస్తూ పోలీసు వారికి సహకరించాలని, నిరంతరం కష్టపడేది మీ కోసమేనని, ప్రజలంతా అర్థం చేసుకొని నియమ నిబంధనలు అమలుపరచు టట్లు చూసుకోవాలని వారన్నారు.

Share it:

TS

Post A Comment: