CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

15 ఏళ్ల వయస్సు పై బడిన యువతి, యువకులు వ్యాక్సిన్ వేయించుకోవాలి.పినపాక ప్రాథమిక కేంద్రంలో వ్యాక్సిన్ శిబిరాన్ని ప్రారంభించిన విప్ రేగా కాంతారావు.

Share it:

 


  • వైద్యశాఖ చేస్తున్న సేవలు అమోఘం
  • కరోనా టీకా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి 
  • పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలియజేసిన తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా


మన్యం మనుగడ , పినపాక: 


కరోనా మహమ్మారి మరలా తన పంజా విసురుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని, రక్షక కవచాలుగా మాస్క్, శానిటైజర్ ఉపయోగించాలని తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒమిక్రాన్ రూపంలో కరోనా ప్రళయ తాండవం చేస్తుందని, దానికి తగినట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. పినపాక మండలంలో కరోనా వ్యాధి నివారణకు పినపాక, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని, పినపాక మండల ప్రజలందరూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేయాలని అన్నారు.ఈ సందర్భంగా పినపాక జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శేషుబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రేగా కాంతారావుకు శాలువా కప్పి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీటీసీలు సర్పంచులు, పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ శివ కుమార్, పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: