CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన సమాజ నిర్మాణానికై విద్యార్థి,యువకులు నడుం బిగించాలి-PDSU, PYL

Share it:

 మన్యం మనుగడ వెవ్ డెస్క్:

ఏడు పదుల స్వతంత్ర భారతంలో విద్యార్థి యువకులను పాలకులు రంగుల ప్రపంచంలో ముంచుతూ వారి భవిష్యత్తు పై వేడుకల పేరుతో సామ్రాజ్యవాద విష ప్రయోగం చేస్తుందని పాలకులు చేసే ఈ కుట్రలను నేటి యువతరం విద్యార్థులు గమనించి నూతన నవసమాజ నిర్మాణానికి నడుం బిగించాలని PDSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కాంపాటి పృధ్వీ, ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర నాయకులు అజయ్ అన్నారు. ఈరోజు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విద్యార్థులు యువకులు వేడుకలలో మునిగిపోకుండా నూతన సమాజ నిర్మాణం కై పాటుపడాలని PDSU ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో PDSU టౌన్ నాయకులు అమ్మడబోయిన పార్థు అధ్యక్షత వహించగా వారు పాల్గొని మాట్లాడుతూ కొత్త సంవత్సరం వచ్చింది అని సంబరాలు వేడుకలు చేసుకునే మనము దేశంలో ప్రతి పేదవాడి బతుకు లో కొత్తదనం ఎందుకు రావట్లేదని వారు అన్నారు.ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరం రాగానే నూతన ఉత్సాహంతో ముందుకెళుతున్నారు కానీ పాలకుల కుట్రలో భాగంగా ఎప్పటిలాగే స్త్రీల పై దాడులు, అత్యాచారాలు,పాలకులే పరోక్ష ప్రత్యక్ష పద్ధతిలో మత్తుపదార్థాల వ్యాపారం ,రైతు ఆత్మహత్యలు ,కార్మిక హక్కుల ఉల్లంఘన,నిరుద్యోగంతో యువకుల ఆత్మహత్యలు పేదవాడికి అందుబాటులో లేని విద్య ,పేదవాడి పై దోపిడి ,కార్పొరేట్ వర్గాలకే సంపద ధారాదత్తం, లాంటివి లేని కొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలని నేటితరం అప్రమత్తంగా ఉంటే దగుల్బాజీ ల పెత్తనమే కొనసాగుతుందని వారు అన్నారు. ఇప్పటికైనా విద్యార్ధి యువకులు కార్పొరేట్ మాయాలోకం నుండి బయటపడి నూతన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో PDSU భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ నాయకులు నరేందర్ గుమ్మడి రవీన, సాయి వరుణ్ శశికుమార్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: