CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గ్రామ గ్రామాన బలోపేతం అవుతున్న భాజపా.

Share it:

 


మన్యం టీవీ మంగపేట.


మంగపేట మండల కేంద్ర పరిధిలోని రాజుపేట గ్రామంలో బీజేపీ మండలాధ్యక్షుడు యర్రంగారి వీరన్ కుమార్ అధ్యక్షతన గురువారం సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ములుగు జిల్లా ఇంచార్జి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ హాజరై మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ పరిపాలన మరియు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ విధివిధానాలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నచ్చి బీజేపీ పార్టీలోకి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు వందల మంది కాంగ్రెస్,తెరాస పార్టీలకు చెందిన రాజుపేట గ్రామంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భారతీయ జనతా పార్టీలో చేరడానికి వచ్చిన వారిని బీజేపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా భాజపా పార్టీ తీర్ధం పుచ్చుకున్న మలిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం లో నరేంద్ర మోడీ పరిపాలన విధానం, ప్రధాన మంత్రి గా మోడీ గారు తీసుకొనే నిర్ణయాలు, ప్రపంచ పటంలో భారత దేశానికి ఒక అద్భుతమైన స్థానం కల్పించిన తీరు, ప్రపంచం దేశాలతో అనుసరిస్తున్న విదేశాంగ విధానం, అంతర్జాతీయ స్థాయిలో గడిస్తున్న పేరు ప్రఖ్యాతి, క్లిష్ట మైన కరోనా సమయం లో సైతం దేశాన్ని నడిపించిన తీరు అమోఘం, అంతే కాకుండా దైర్యంగా తీసుకొనే నిర్ణయాలు, పొరుగు దేశాలలో సైతం ఆలోచన చేసేలా ఉన్న పరిపాలన, దేశం సమగ్రత కోసం ఎటువంటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడని అద్భుతమైన పోరాట పటిమ అప్పుడు ఇందిరా గాంధీ ఇప్పుడు నరేంద్ర మోడీ లో ఉన్నాయి అందుకే భాజపా లో చేరాను తెలంగాణా లో సైతం రాబోయేది, వచ్చేది కూడా బీజేపీ పార్టీ యే ఎందుకంటే బలమైన నాయకులు బండి సంజయ్, అరవింద్, ఈటెల రాజేందర్ లాంటి నాయకులు ఆధ్వర్యంలో తెలంగాణా లో కాషాయం రెప రెపలు కమల వికాసం తప్పదు అని ఈ సందర్బంగా అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు అల్లే జనార్దన్, జిల్లా అధికార ప్రతినిధి దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, కార్యాలయ కార్యదర్శి చల్లూరి మహేందర్ ,గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు జబ్బ సమ్మయ్య ,మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహ్మద్ యాకుబ్ పాషా మరియు జిల్లా మండల పదాధికారులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: