CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా ఎస్ఎఫ్ఐ 52 వ ఆవిర్భవ దినోత్సవాలు...

Share it:

 


మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, డిసెంబర్ 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రం లోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ఎస్ఎఫ్ఐ మండల కమిటీ మరియు స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా ఎస్ఎఫ్ఐ 52వ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు గార్లపాటి పవన్ కుమార్ జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ.. కేరళ రాష్ట్ర రాజధాని అయిన త్రివేండ్రం అనే ప్రాంతంలో 1970లో అధ్యాయనం పోరాటం నినాదాలతో, స్వతంత్రం ప్రజాస్వామ్యం, సోషలిజం అనే లక్ష్యాలతో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఏర్పడిందని అన్నారు. దేశంలో పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని అనేక పోరాటాలు చేసిందని అన్నారు. పోరాటంలో భాగంగా అనేకమంది విద్యార్థి నాయకులు అమరులు అయ్యారని అన్నారు. వారి ఆశయాలతో మరింత ముందుకు పోవాలని విద్యార్థులకు సూచన ఇచ్చారు. ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్, జెమ్మి యశ్వంత్ లు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం వల్ల అనేక మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతారని అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు తమ సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం ఈ విద్యావిధానం తీసుకు వచ్చారని అన్నారు. నూతన విద్యా విధానాన్ని ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తుందని అన్నారు. నూతన రైతు చట్టాలు రైతులు పోరాడి విజయం సాధించారని అన్నారు. అదే రీతిలో విద్యార్థులందరూ ఎస్ఎఫ్ఐ తో కలిసి నూతన విద్యా విధానాన్ని రద్దు చేసే వరకు పోరాడాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే రెండు లో ఉన్న 3568 కోట్ల బకాయిలు విడుదల చేయాలని అన్నారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వం అందించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు ధరావత్ నరసింహారావు, ఉదయ్ చరణ్, వంశి, శివ, లక్ష్మణ్, ప్రవళిక, శ్రీవిద్య, శిరీష, అలేఖ్య, జోషి, భార్గవ్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: