CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మేడారం జాతర ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి,సత్యవతి రాథోడ్ సమీక్ష.

Share it:

 


  • మేడారం జాతర పనులను ముమ్మరం చేయండి.
  • ప్రణాళిక బద్ధంగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించండి.
  • పెండింగ్ పనులపై దృష్టి పెట్టండి.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గురు వారం మంత్రులు అటవీ, పర్యావరణ,న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,స్త్రీ-శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లు మాట్లాడుతూ..గ‌తంలో కంటే మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు అధికారులు కృషి చేయాలని గతంలో వచ్చిన ఇబ్బందులను బేరీజు వేసుకుని,వాటిని ఈసారి అధిగమించేలా చూడాలని,

తాగునీటి,పారిశుద్ధ్యం,వసతి,ఇతర సౌకర్యాలపై దృష్టి సారించాలని అన్నారు.

సామాన్య భక్తుల క్యూ లైన్లు, భారీకెడ్లు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోవిడ్,ఒమిక్రాన్ వేరియంట్ లు వ్యాప్తి చెందకుండా భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు దృష్టి సారించాలని అన్నారు.ప్ర‌తి ఒక్క‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా చూడాలని,జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు త్రాగు నీటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని,స్నాన ఘ‌ట్టాల వ‌ద్ద త‌గిన ఏర్పాట్లు చేయాలని అన్నారు.ర‌హ‌దారుకిరువైపుల ఆర్అండ్ బీ అధికారులు సూచిక బోర్డుల‌ను ఏర్పాటు చేయాలని,భ‌క్తుల ర‌ధ్దీకి అనుగుణంగా ప్ర‌త్యేక క్యూ లైన్ల‌ను ఏర్పాటు చేయాలని,పార్కింగ్ ఇబ్బందులు తలెత్త‌కుండా పోలీస్ శాఖ వారు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకొవాలని అన్నారు.పోలీసు శాఖ ప్రత్యేక కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలని,మన ఇంటికి వచ్చే అతిథులను ఎలాగో చుస్తామో...జాతరకు వచ్చే భక్తులకు అలాంటి ఏర్పాట్లు చేయాలని,జాతర అనంతరం చెత్త తొలగింపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.జనవరి 15 లోగా పనులు పూర్తి అయ్యేలా ఆధికారులు పని చేయాలని అన్నారు. మేడారం లో జరిగే అభివృద్ధి పనులను పరిసర ప్రాంతాలను,మేడారం జాతర ఏర్పాట్లను,అటవీ,ప‌ర్యావ‌ర‌ణ‌,న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,రాష్ట్ర గిరిజన,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప‌రిశీలించారు.జంపన్న వాగు వ‌ద్ద నిర్మించిన‌ స్నాన ఘట్టాలను,షేడ్లను,ఇత‌ర ప‌నుల‌ను మంత్రులు పరిశీలించారు.అంతకుముందు సమ్మక్క,సారలమ్మను మంత్రులు దర్శించుకున్నారు.  

ఈ కార్య‌క్ర‌మంలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఎమ్మెల్యే సీతక్క,దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్‌ కృష్ణఆదిత్య,ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్,వివిధ శాఖల అధికారులు,ప్ర‌జా ప్ర‌తినిదులు,పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: