CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించిన ముళ్లకట్ట సొసైటీ ఎన్నికల ను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలి.:సొసైటీ సభ్యులు ముళ్లకట్ట, రాంపూర్ మహిళలు.

Share it:

 



మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ముళ్లకట్ట గ్రామానికి చెందిన సొసైటీ సభ్యులు ఈ నెల 23 వ తారీఖున రోజున మహాజన సభ ద్వారా జరిగిన ఎన్నికల ను రద్దుచేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు.జిల్లా డిసిఓ తీసుకున్న నిర్ణయాన్ని మేము సొసైటీ సభ్యులము వ్యతిరేకి స్తున్నామని,ఏఎన్నికలైనా సంబంధిత అధికారులు ఆ యొక్క ఎలెక్షన్స్ తేదీ ని ప్రకటించి ఆ గ్రామంలో టాం.. టాం... చేపించి గ్రామ పంచాయతీ ఆఫీసులో నోటీసులు అంటించి ప్రజలకు తెలియజేసి ఎన్నికలను నిర్వహిస్తారని అప్పుడే రాజ్యాంగ బద్దంగా జరిగిన ఎన్నికలవుతాయని తెలియజేసారు.కానీ ఇవేమీ పాటించకుండా ఒక నోటీసులు మాత్రమే జారీచేసి,ఎలెక్షన్స్ తేదీ ని ప్రకటించకుండా ఆదరా...బాదరా గా సొసైటీ సభ్యులందరు వారి వారి వ్యవసాయ పనులకు వెళ్లిన క్రమంలో ఒక పద్ధతి ప్రకారం ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించి,అకస్మాత్తుగా వచ్చి,ఒక వర్గం వారే ఉండే విధంగా చూసుకొని ఎలెక్షన్స్ నిర్వహించడం అనుమానాల కు తావిస్తోందని వాపోయా రు.తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి జరిగిన ఎలెక్షన్స్ ను రద్దు చేసి,మరలా ఎలెక్షన్స్ తేదీ ని డిక్లేర్ చేపించి ఎలెక్షన్స్ నిర్వహించేవిధంగా జిల్లా డిసి ఓ కు సూచిస్తూ తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని సొసైటీ సభ్యులు అందరూ కోరుతున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రమాదేవి సంఘం అధ్యక్షులు సురబాక జయమ్మ,ఉపాధ్యక్షులు కురిసే ఈశ్వరి,కార్యదర్శి ఆలెం రాజేశ్వరి,గంగమ్మ సంఘం అధ్యక్షులు మాడే విజయలక్ష్మి,ఉపాధ్యక్షులు మడప దేవి,కార్యదర్శి లావణ్య,ధనలక్ష్మి సంఘం అధ్యక్షులు తల్లాడ నాగమణి, ఉపాధ్యక్షులు కొడిప లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: