CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఓమిక్రాన్ నేపథ్యంలో న్యూఇయర్ వేడుకలు ఇళ్లలోనే జరుపుకోవాలి--:ఇల్లందు సర్కిల్ ఇన్స్పెక్టర్ బర్పటి రమేష్

Share it:

 


మన్యం మనుగడ ,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

కరోనా తరువాత ఓమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలు ప్రతిఒక్కరూ తమ తమ ఇళ్లలోనే జరుపుకోవాలని ఇల్లందు *సిఐ బర్పటి. రమేష్* తెలిపారు.

ఈ సారి మీరంతా న్యూఇయర్ వేడుకల పై నిషేధం విధించటం జరిగిందని ఎవరైనా శాంతిభద్రతలకు విగతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అయన తెలిపారు. బైకుల పై చక్కర్లు కొట్టటం,రోడ్ల మీద గోల చేయటం వంటివి ఎవరైనా చేపడితే అట్టివారి బైకులను సీజ్ చేయటమే కాకుండా కేసులు నమోదు చేసిన జైలుకు పంపటం జరుగుతుందని సిఐ తెలిపారు. ప్రతిఒక్కరూ ఇంటి నుండి బయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అలాగే శానిటైజర్ ను కూడ ఉపయోగించుకొని సోషల్ డిస్టెన్స్ ను పాటించాలని ఆయన కోరారు. *నూతన సంవత్సరం* సందర్బంగా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిబంధనలను పోలీస్ శాఖ వర్తింపచేయటం జరిగిందని ప్రతిఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించి ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సిఐ బర్పటి రమేష్ కోరారు.

Share it:

TS

Post A Comment: