CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ

Share it:

 





మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం లో శుక్రవారం ఐటీడీఏ పీవో గౌతమ్ కొండరెడ్ల గ్రామాల్లో పర్యటించారు. గిరి పోషణలో భాగంగా కొండరెడ్ల పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందించే ఉద్దేశంతో ఐటీడీఏ ద్వారా జోవర్ మీల్స్, మల్టీగ్రెయిన్ మిల్స్, మల్టీ గ్రీన్ స్వీట్ మీల్స్ అందిస్తున్నారు. ముందుగా రెడ్డిగూడెం అంగన్వాడి సెంటర్ లో ఆహార పదార్థాలను పరిశీలించారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న లేదా అని అడిగి తెలుసుకున్నారు. వర్షం వస్తే అంగన్వాడి బడి కురుస్తుందని పిల్లలకు ఇబ్బంది కరంగా ఉందని అక్కడ ప్రజలు తెలపగా కొత్తగా అంగన్వాడి మంజూరు చేసి త్వరలోనే పనులు మొదలు పెడతామని, కుక్కర్స్, స్టోరేజ్ బౌల్స్ అందిస్తామని తెలిపారు. పిల్లలకు ఆటలు ఆడుకునేందుకు సీసా, ఉయ్యాలలో జారుడు బల్లలు ఏర్పాటు చేయిస్తామని ఐటీడీఏ పీవో హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న అంగన్వాడి సెంటర్ ను పడేసి అదే స్థలంలో నిర్మాణాలు చేపడతామని అంతవరకు స్కూల్ కంపౌండ్ లో ఉన్న బిల్డింగ్ లో అంగన్వాడి బడి కొనసాగించాలని ఆదేశించారు. కాసేపు పిల్లలతో ముచ్చటించారు. అనంతరం బండారు గుంపు లో ఉన్న అంగన్వాడి సెంటర్ ను సందర్శించి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు, అక్కడ పిల్లలను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. కొండరెడ్ల గ్రామాల్లో సమస్యలు ఉంటే త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజు, ఏపీఓపిటిజి సురేష్ బాబు, తాహాసిల్దార్ చల్ల ప్రసాద్, ఐటిడిఎ డిఈ రాజు, సిడిపివోలు రోజా రాణి రేవతి, సూపర్వైజర్లు విజయలక్ష్మి, సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, ఆర్ఐ అనిల్, విఆర్ఓ లాలు, ఏఎన్ఎం భూబి నాంచారి, రాములమ్మ, అంగన్వాడి టీచర్ ధనమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: