CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతును రాజుగా కీర్తించే రోజులు రావాలి.జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కామర్స్ మినిస్ట్రీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి.

Share it:

 



 


  •  వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు.

మన్యం టీవీ మంగపేట.

రైతుని రాజుగా కీర్తించే రోజు రావాలని దండుగ లా పడివున్న వ్యవసాయ రంగానికి పండుగ చేసుకునే సమయం ఆసన్నం కావాలని ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కామర్స్ మినిస్ట్రీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు గురువారం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా వికాస్ అగ్రి ఫౌండేషన్ కార్యాలయంలో రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సాంబశివరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగం రోజు రోజుకి దుర్భర పరిస్థితుల్లోకి నెట్టబడుతోందని ఇలాంటి ఆపన్న సమయంలో ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ పిలుపునిచ్చినట్లుగా జై జవాన్ జై కిసాన్ అనే నినాదం నినాదంగా మాత్రమే కాకుండా ఆచరణాత్మకం కావాలని ఆకాంక్షించారు అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకునే విధంగా వ్యవసాయ రంగానికి ప్రత్యేక ఉద్దీపనలు ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు హరిత విప్లవానికి ఎంతో కృషి చేసిన భారత జాతి గర్వించదగ్గ రైతు నేత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినాన్ని జాతీయ రైతు దినోత్సవంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు అనంతరం చౌదరి చరణ్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన రాజుపేట కెనరా బ్యాంక్ మేనేజర్ సురేంద్ర యాదవ్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో తమ కెమెరా బ్యాంకు చేస్తున్న కృషి వెలకట్టలేనిది అన్నారు వ్యవసాయ అనుబంధ రంగాలకు తమ బ్యాంకు అందిస్తున్న సేవలకు పునరంకితం అవుతామని పేర్కొన్నారు అనంతరం రూపాయలు 10,000 విలువైన సూక్ష్మ పోషకాల కిట్లను రైతులకు వికాస్ అగ్రి ఫౌండేషన్ తరపున ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆకినేపళ్లి మల్లారం రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ షేక్ మదార్ సాహెబ్ టి కొత్తగూడెం అకినేపల్లి మల్లారం జిల్లా సరిహద్దు గ్రామాల రైతులు మరియు వికాస్ ఆగ్రీ ఫౌండేషన్ ప్రతినిధులు శెట్టిపల్లి తిరుపతిరావు నేలపట్ల శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: