CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అశ్వారావుపేట లాడ్జిలలో అసలేం జరుగుతోంది.?

Share it:

   •  రాత్రివేళ వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారంటూ పుకార్లు షికార్లు...! 
  •  లాడ్జి రిజిస్టర్ లో కొట్టివేతలకు కారణమేమి? 
  •  లక్షలు చేతులు మారాయంటూ వదంతులు


 మన్యంటీవి, అశ్వారావుపేట:స్థానిక ఒక పేరుమోసిన లాడ్జిలో గత నెల 29 వ తేదీ శుక్రవారం రాత్రి ఎం జరిగిందో అర్ధం కాని పరిస్థితి పట్టణ వాసుల్లో నెలకొంది. అసలు ఆ రాత్రి ఏమి జరిగింది....? అశ్వారావుపేట పట్టణంలోని ఓ లాడ్జిలో శుక్రవారం రాత్రి వ్యభిచారం చేస్తూ ఓ జంట పట్టుబడ్డారన్న విషయం పట్టణంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. అలాగే ఈ విషయమై పోలీసుల నుండి వచ్చిన సమాధానాలకు పొంతన లేదు. కానీ సదరు లాడ్జిలో వ్యభిచారం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. లాడ్జి యజమాని తెలిపిన వివరాల ప్రకారం స్వయంగా స్థానిక అశ్వారావుపేట ఎస్ ఐ రిజిస్టర్ లో నమోదు ఆయిన వివరాలను కొట్టివేశారని, అదే స్థానంలో వస్త్ర వ్యాపారానికి సంబంధించిన వ్యక్తి ఫోన్ నెంబర్ అని రిజిస్టర్ లో నమోదు చేసి పశ్చిమగోదావరి కి చెందిన కామయ్యపాలెం నుండి అశ్వారావుపేటకు షాపింగ్ పనిమీద వచ్చి (అడా మగ అనేది పూర్తి వివరాలు లేవు) ఆరోజు బస చేసినట్లు వివరాలను చూపిస్తూన్నారని, ఈ రిజిస్టర్ వివరాల విషయంలో అసలు ఆ రాత్రి అసలు సంఘటన ను సరైన దారిలో నడిపిస్తున్నారా లేదా తప్పుడు సమాచారం నమోదు చేసి సాక్ష్యాలను తారుమారు చేసి విషయాన్ని పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పట్టణ వాసులు వాపోతున్నారు. ఈ విషయాలలో భాగస్వామి అయిన వారికి భారీ ముడుపులు అందాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అదే కారణంతో విషయాన్ని పక్క దారి పట్టించే విషయాలు మంతనాలు జరగడం విశేషం. వివరాలు ప్రకారం తూర్పుగోదావరి జిల్లా చెందిన ఒక యువతి అశ్వారావుపేట పట్టణం లో తాజాగా వస్త్రవ్యాపారం నిర్వహించే యువకుడు పట్టణంలోని ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డారన్న విషయం విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం బట్టి తెలుస్తోంది. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా అటువంటి సంఘటన ఏదీ జరగలేదని తొలుత మాట్లాడినా.. ఆ తరువాత కొద్దిసేపటికి స్థానిక లాడ్జి వద్ద శుక్రవారం అర్ధరాత్రి వేళ ఒక యువకుడు బైక్పై వెళ్లిపోవడం జరిగిందని రాత్రి వేళల్లో విధులు నిర్వహిస్తున్న బ్లూకొట్ విధిలో ఉన్న  పోలీసులకు యువకుడు తారసపడటం జరిగిందని, వారు ఎంత ప్రయత్నించినా యువకుడు ఆగలేదని వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. కానీ సాధారణ తనిఖీ అర్ధరాత్రి పోలీస్ ఏవిదంగా చేశారు? తనిఖీలలో తలుపు పగలగొట్టి మరి ఎలా తనిఖీలు నిర్వహిస్తారు? అనేది పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు లాడ్జిలో తనిఖీలు నిర్వహిస్తే ఒక గదిలో ఒక మహిళ ఉన్నదని, కానీ పోలీసులు అక్కడ ఉన్న మహిళను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసినట్లు పలు పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై  కొందరు ప్రభుద్ధులు వ్యవహారాన్నీ పక్కదారి పట్టిచాడనికి పలు ప్రయత్నాలు, బెదిరింపులకు కూడా పాల్పడడం పలు ప్రశ్నలకు, సందేహాలకు తావిస్తోంది. సదరు లాడ్జి యజమానిని వివరాలు అడుగగా లాడ్జిలో ట్రైనీ పోలీసులకు ఒక రూము, మరో మూడు రూములు బుక్ అయి నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే 29 వ తేదీ శుక్రవారం రాత్రి లాడ్జిలో ఏ రూమ్ లో కూడా శుక్రవారం రాత్రి మహిళ బస చేయలేదని పేర్కొనడం, వారు రికార్డును బట్టి చెప్పటంతో పలు అనుమానాలు నెలకొన్నాయి. సీసీ కెమెరాల్లో వివరాలు చెప్పమని అడిగితే సిసి కెమెరాలు పనిచేయడం లేదని కూడా పోలీసులు, లాడ్జి యాజమాన్యం చెప్పడం వివాదాస్పదమవుతోంది. శుక్రవారం అర్ధరాత్రి వేళ లాడ్జి వద్ద వ్యభిచరిస్తూ దొరికిన వారిని బ్లూ కొట్ పోలీస్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నట్లు పట్టణంలో ఊహాగానాలు ఓ పక్క లాడ్జీలొ మహిళ ఉన్నదని స్వయంగా ఎస్సై పేర్కొనటం పై ఓ పక్క, మా లాడ్జిలో శుక్రవారం రాత్రి మహిళలు ఎవరూ లేరని లాడ్జి యాజమాన్యం పేర్కొనడం మరోవైపు వీటన్నింటిని చూస్తే అసలు ఇక్కడ లాడ్జిలో ఏం జరిగిందన్న ప్రశ్న సామాన్యుడు లొ సైతం ఏదో అనుమానం ఇంకా మెదులుతూనే ఉంది. అయితే పై ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సిన, అనుమానాలను తీర్చే బాధ్యత పోలీసుల పైనే ఉంది. కాగా ఎవరికి వారు వాళ్ళ తెలివికి పదును పెడుతూ వాళ్ళకు తోచిన రీతిలో దారులు వేస్తూ అసలు దొంగ ఎవరు అనేది సమాధి చేస్తుండడం విశేషం, వ్యవహారం మొత్తం తప్పుడు దారి పట్టించడం హేయమైన చర్య. ఈ విషయం నుండి అసలు ముద్దాయిని దాయడం కోసం వేరొక వ్యక్తిని ముద్దాయిగా చిత్రీకరించడం కోసం భారీగానే మూల్యం చెల్లించినట్లు సమాచారం. అసలు సదరు లాడ్జిలలో నమోదయిన వివరాలను పోలీసులు కొట్టివేయడం వివరాలను మార్చాలని చూడడం సాక్ష్యాలను తారుమారు చేయడం ఎందుకు? ఆవిషయానికి సంబంధించి మరేమైనా కారణాలు ఉన్నాయా  లేదా మరేమైన విషయం దాచే ప్రయత్నం చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయాలలో నిజానిజాలు బయటకు రావాలంటే ఉన్నతాధికారుల జోక్యం ఎంతైనా అవసరం. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి సరైన రీతిలో దర్యాప్తు నిర్వహించి లాడ్జిలలో వస్తున్న వదంతులను నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

Share it:

TS

Post A Comment: