CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బృహత్ పల్లె ప్రకృతి వనం మాకొద్దు.బుచ్చంపేట గ్రామస్తుల డిమాండ్

Share it:






  • మంగపేట ఫారెస్ట్ రేంజి అధికారి షకీల్ పాషా కు వినతిపత్రం అందజేసిన బుచ్చంపేట గ్రామస్తులు

మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలంలోని బుచ్చంపేట గ్రామానికి సంబంధించిన గ్రామకంఠం భూమిలో బృహత్ పల్లె ప్రకృతి వనం పెట్టొద్దని గ్రామస్తుల డిమాండ్ చేశారు.  బృహత్ పల్లె ప్రకృతి వనానికి వేరే స్థలంలో భూమి కేటాయించాలని బుచ్చంపేట గ్రామస్తులు సుమారు రెండు వందల యాభై మంది గ్రామస్తులు బుధవారం మండల ఫారీస్ట్ రేంజి అధికారి షేకిల్ పాషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో 1970లొనే గ్రామానికి ముత్యాలమ్మ గుడి, నాగులమ్మ గుడి నిర్మించుకున్నామని తెలిపారు.  మిగత భూమిని గ్రామకంఠం భూమిగా గ్రామ తీర్మానం సిగేసుకున్నామని అట్టి స్థలంలో  బస్టాండ్ మరియు రామాలయం గుడి, పెరిగిన జనాభా దృష్ట్యా ఒక ఇంట్లో మూడు నాలుగు కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. మా గ్రామానికి ఉన్న ఒకే ఒక గ్రామకంఠం భూమి ఇది తప్ప ఏది లేదని ఇప్పుడు అధికారులు బృహత్ పల్లె ప్రకృతి వనం పెట్టాలని ప్రయత్నాలు విరమించుకోవాలని అన్నారు. నిలువ నీడలేని ఇల్లు నిరుపేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం కాపాడుకున్నామని తెలిపారు. బృహత్ పల్లె ప్రకృతి వనం వేరే ప్రదేశంలోకి మార్చుకోవాలని గ్రామస్తులు అన్ని కులాల వారు  సుమారు రెండు వందల యాభై  మంది ప్రజలు విన్నవించుకున్నారు. సానుకూలంగా స్పందించిన ఫారెస్ట్ రేంజి అధికారి పల్లె ప్రకృతి వనాన్ని వేరే గ్రామంలో ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

Share it:

TS

Post A Comment: